కంగన చేస్తున్న పనికి అంతా షాక్..!
ఆలియా భట్ తండ్రి మహేశ్ భట్ నిర్మించిన 'గ్యాంగ్‌స్టర్' సినిమాతో హీరోయిన్‌గా లాంచ్ అయింది కంగన రనౌత్ ఇక ఈ మూవీ సమయంలో మహేశ్ భట్‌ని తెగ పొగిడింది కంగన. మహేశ్ భట్ లేకపోతే కంగన లేదు, కంగన కెరీర్ లేదు అనే రేంజ్‌లో స్పీచ్ లు ఇచ్చింది. అయితే ఈ మధ్య ఏమైందో ఏమో అవకాశం సృష్టించుకొని మరీ మహేశ్ భట్‌ని తిడుతోంది. మహేశ్ భట్ కూతురు ఆలియా భట్‌నీ విమర్శిస్తోంది. ఇప్పుడున్న హీరోయిన్లలో ఆలియా భట్ బెస్ట్ పెర్ఫామర్ అని మెజారిటీ ఒపీనియన్. అందుకే సౌత్ మేకర్స్ కూడా ఆలియా కాల్షీట్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ కంగన మాత్రం ఆలియాని టార్గెట్ చేస్తోంది. ఇంతకుముందు దీపిక పదుకొణేని కూడా విమర్శించింది.
కంగన రనౌత్‌కి 'తను వెడ్స్ మను రిటర్న్స్' తర్వాత సరైన హిట్ లేదు. వరుస ఫ్లాపులతో కెరీర్ డౌన్ అవుతోంది. ఇక ఇదే టైమ్‌లో దీపిక పదుకొణే 'పీకు, బాజీరావు మస్తానీ, పద్మావత్' లాంటి సినిమాలతో నంబర్ 1 హీరోయిన్‌గా నిలిచింది. 'ట్రిపుల్ ఎక్స్- రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్'తో హాలీవుడ్‌కి కూడా వెళ్లింది. ఆలియా భట్ కూడా 'రాజీ, గల్లీబాయ్' లాంటి సినిమాలతో బెస్ట్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకుంది. 'ఆర్ ఆర్ ఆర్, బ్రహ్మాస్త్ర' లాంటి లార్జ్ స్కేల్ మూవీస్ చేస్తోంది.
కంగన రనౌత్‌ని బాలీవుడ్ జనాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. వాళ్ల అటెన్షన్ అంతా దీపిక, ఆలియా వైపే ఉంటోంది. దీంతో కంగనకి ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయిందని, ఈ ఫ్రస్ట్రేషన్‌తోనే దీపిక, ఆలియాని టార్గెట్ చేస్తోందట కంగన. అందుకే 'గెహరాయియా' స్ట్రీమింగ్ అయ్యాక ఎక్స్‌పోజింగ్‌తో సినిమాలు హిట్ కావని ఇండైరెక్ట్‌గా దీపికని విమర్శించింది కంగన అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. కమర్షియల్ సినిమాల్లో ఆఫర్స్ తగ్గాక కంగన రనౌత్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌ని ఫోకస్ చేసింది. అయితే తాప్సీ వల్ల ఈ సినిమాలు కూడా రావడం లేదు.