షాక్ : జగన్ అపాయింట్మెంట్ కోసం పేర్ని నానిని కోరిన బాలకృష్ణ..!!

Divya
తాజాగా బాలకృష్ణ గురించి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధర ముగిసినట్లే ముగించి మళ్లీ మొదటికి వచ్చినట్లుగా కనిపించడం అందర్నీ ఆందోళనలో ముంచేసింది.. మెగా భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ల ధరల అంశం కొలిక్కి వచ్చినట్లే అని అందరూ హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే టికెట్ల ధరలు పెంచుతారు అని మిగతా సినిమాలకు ఈ సమస్యలు ఉండవు అని .. సినీ ఇండస్ట్రీలో ఉండే సమస్యలకు కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది అని రాజకీయ వర్గాలలో అలాగే సినిమా వర్గాలలో వార్తలు బాగా వినిపించాయి.
ఇకపోతే పలుచోట్ల థియేటర్లు కూడా మూతపడడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రాస్తారోకోలు కూడా చేశారు. మొన్నటికి మొన్న టికెట్ల ధరలు నచ్చకపోతే సినిమా విడుదలను వాయిదా వేసుకోండి అంటూ భీమ్లా నాయక్  పై బొత్స సత్యనారాయణ చేసిన మాటలు కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. ఇంకా  చెప్పాలంటే థియేటర్ల సమస్య,  మరొకవైపు టిక్కెట్ల ధరల తగ్గింపు కారణంగా ఎన్నో సినిమాలు వాయిదా వేసుకోవలసి వచ్చింది. ఎప్పుడో రాజకీయ మార్పు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే కాబట్టి ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా విడుదల నేపథ్యంలో కూడా అదే రాజకీయ సమస్య కొనసాగడం గమనార్హం.
ఇక ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ నేతలు మాజీ సీఎం చంద్రబాబు అలాగే మాజీ మంత్రి లోకేష్ కూడా స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి పేర్ని నాని కౌంటర్ వ్యాఖ్యలు చేయడంతో పాటు నటుడు అలాగే ఎమ్మెల్యే బాలకృష్ణ పై కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలకు ముందురోజు నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప అప్పారావు ద్వారా ఆ సినిమా నిర్మాతలు విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి వచ్చి తనను కలిశారని మంత్రి నాని స్పష్టం చేశారు.
మంత్రి నాని మాట్లడుతూ..అంతే కాదు బాలకృష్ణ గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడారు.. అప్పుడు నాతో .. నేను  సీఎం జగన్ ని కలుస్తా అపాయింట్మెంట్ కావాలని కూడా బాలకృష్ణ చెప్పారు..ఇక ఈ విషయాన్ని సీఎం గారికి కూడా నేను తెలిపాను అని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.. అప్పుడు సీఎం జగన్ .. బాలకృష్ణ ఎందుకు నన్ను కలవాలని అనుకుంటున్నారు.. సినిమా రిలీజ్ గురించి అని నేను సీఎం కి చెప్పాను . కానీ సీఎం బాలకృష్ణ గారి క్యారెక్టర్ దెబ్బతింటుంది వద్దు అని నాతో చెప్పారు అని పేర్నినాని చెప్పుకొచ్చారు. ఇక ముఖ్యమంత్రి బాలకృష్ణ పరువు ప్రతిష్టలు ఆలోచించారు కాబట్టి మీట్ అవ్వడం వద్దు అని జగన్ చెప్పారు అది తప్పుగా భావించే వాళ్ల కర్మ అంటూ మంత్రి పేర్ని నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: