భీమ్లా నాయక్ : థియేటర్లో స్టెప్పులేసిన థమన్?

praveen
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మేనియా మొదలైంది.. ప్రస్తుతం ఎక్కడ చూసినా థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎలా ఉంటుందో భీమ్లా నాయక్ మరోసారి రుజువు చేసింది. ఇక అటు సినిమాలకు దూరం అయిన ప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గలేదు అని మరోసారి భీమ్లా నాయక్ నిరూపించింది. ఎన్నో రోజుల నుంచి పవన్ కళ్యాణ్ నుంచి అసలు సిసలైన సాలిడ్ మాస్ యాక్షన్ సినిమా కావాలని కోరుకుంటున్న అభిమానులందరికీ కూడా భీమ్లానాయక్ సినిమా అసలు సిసలైన సంతృప్తిని ఇస్తుంది.


 ఇక ఈ సినిమా కోసం అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసిన డైలాగులు అయితే ప్రతి ఒక్కరికీ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రానా నటన పిక్స్ లెవెల్ లో ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాకుండా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సంగీతం ప్రాణం పోసింది.ప్రతి పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇకపోతే ఇటీవలే భీమ్లా నాయక్ సినిమా చూడటానికి వెళ్లిన తమన్ ఏకంగా థియేటర్ లో డాన్స్ స్టెప్పులు వేసి అద్దరగొట్టాడు.



 దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సినిమా టైటిల్ సాంగ్ అయినా లాల భీమ్లా పాట రాగానే ఇక పూనకం వచ్చినట్లుగా ఊగిపోయాడు  థమన్.  థియేటర్లో స్క్రీన్ దగ్గరకు వెళ్లి స్టెప్పులు వేశాడు. డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి సింగర్ రేవంత్ తో కలిసి డాన్స్ చేశాడు. ఇది నా లీడర్ పవన్ కళ్యాణ్.. నా జీనియస్ త్రివిక్రమ్ కోసం.. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్న అంటూ తమన్ ఇక ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారిపోయింది. అయితే మొన్నటి వరకు డాన్స్ లకు దూరంగా ఉంటే తమన్  ఇటీవల కాలంలో డాన్సులతో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: