కొంత కాలం క్రితం వరకు
బాక్స్ ఆఫీస్ దగ్గర వరస పరాజయాలతో డీలా పడిపోయిన
మాస్ మహారాజా
రవితేజ 'క్రాక్' సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు, ఇలా
క్రాక్ సినిమా అదిరిపోయే విజయం సాధించడంతో
మాస్ మహారాజ
రవితేజ ప్రాతుతం
రవితేజ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు, అందులో భాగంగా ఇప్పటికే
రవితేజ,
రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి సినిమాను పూర్తి చేసి విడుదల కూడా చేశాడు. ఇలా ఇప్పటికే ఒక సినిమాను పూర్తి చేసి విడుదల చేసిన
మాస్ మహారాజ
రవితేజ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో
సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు, అందులో భాగంగా రవితేజ ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర
సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు, ఇలా ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్న
రవితేజ ప్రస్తుతం ధమాకా
సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ధమాకా సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలు
రవితేజ సరసన
పెళ్లి సందD
హీరోయిన్ శ్రీ లీల
హీరోయిన్ గా నటిస్తోంది, ధమాకా సినిమాకు డబుల్ ఇంపాక్ట్ అనేది కాప్షన్. పీపుల్స్
మీడియా ఫ్యాక్టరీ,
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి టీజీ
విశ్వ ప్రసాద్
నిర్మాత, ఇది ఇలా ఉంటే ధమాకా
సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం (ఫిబ్రవరి 25) హైదరాబాద్లో ప్రారంభమైంది , ఈ
సినిమా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో
రవితేజ తో హై హోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించుకున్నారు. ధమాకా సినిమాలోని ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రముఖ ఫైట్ మాస్టర్లు
రామ్ లక్ష్మణ్ సారథ్యంలో జరుగుతున్నాయి, వినోదాత్మకంగా ఉంటూనే
మాస్ అంశాలు ఉన్న ఈ
మూవీ లో కీలకమైన పోరాటమిది అని
నిర్మాత తెలిపారు.