పుష్ప కోసం అలా.. జోష్ లో బన్నీ ఫ్యాన్స్!!

P.Nishanth Kumar
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకున్న అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ను సరికొత్త అవతారంలో చూపించిన ఈ సినిమాకు ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. ఏ విధంగా ఓ సాధారణ కూలీ గంధపు చెక్కల స్మగ్లర్ ఆ వ్యవస్థను పరిపాలించాడు అనేదే ఈ సినిమా కథ. ఓ మంచి పాయింట్ ను తీసుకొని ప్రేక్షకుల అందరికీ నచ్చే విధంగా చేసి ఇప్పుడు అంతటి స్థాయి విజయాన్ని అనుభవిస్తున్నారు చిత్రబృందం.

మొదటినుంచి పుష్ప సినిమాపై భారీ స్థాయిలో అంచనాలే ఉన్నాయి. అయితే కథ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేస్తున్నామని చెప్పారు యూనిట్. అలా పుష్ప యొక్క మొదటి భాగం రెండవ భాగం యొక్క షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి .ఇదే సమయంలో సుకుమార్ ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్స్ చూసే పనిలో పడ్డారట. అంతేకాదు ఇప్పుడు వచ్చిన ఈ క్రేజ్ కు తగ్గట్టుగా సినిమాలో కొన్ని మార్పులు కూడా చేయబోతున్నాడట.

అయితే ఇది బన్నీ అభిమానులు ఎంతగానో ఖుషీ చేస్తుంది. పాన్ ఇండియా సినిమాగానే వస్తుంది అని తెలిసినా కూడా ఈ చిత్రానికి ఇంతటి స్థాయి విజయం దక్కుతుందని ఎవరూ ఊహించలేదు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని అందరికీ నచ్చే విధంగా చేసి మరొకసారి భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని సుకుమార్ ఈ చిత్రాన్నికి మార్పులు చేయబోతున్నాడని తెలుస్తోంది. మరి ఈ కీలక మార్పులు సినిమా పట్ల ఎంతటి క్రేజ్ ను తీసుకు వస్తాయో చూడాలి. ఈ సినిమాను దసరాకు విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. మరి ఈ విడుదల తేదీ లో ఏదైనా మార్ప వస్తుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: