12 ఏళ్ల సమంత ఏం చెప్పిందంటే...? ఏం మాయ చేశావే
బాగా ఆకలి..అన్నం ఉంటుంది.. పెరుగు వీటితో పాటు పచ్చడి ఇవన్నీ ఉంటాయి.తినేందుకు టైం ఉండదు. ఆకలి ఉంటుంది అన్నం కూడా దొరకని రోజులుంటాయి..ఈ రెండు ఘటనల్లో కూడా సమంత ఉంటుంది.ఆమె అనే కాదు ఎందరో ఉంటారు.ఉండాలి కూడా! ఆవిధంగా సమంత నటిగా రాణించిన రోజులు మరియు అవకాశాల్లేని రోజులు రెండింటినీ సమానంగానే చూశారు .. చూస్తున్నారు.ఏం మాయ చేశావే అనే సినిమాకు ముందు కూడా సమంత ఉందన్న విషయం మరువకూడదు. ఇప్పుడు శకుంతల అనే సినిమా తరువాత కూడా సమంత ఉంటుంది అన్న విషయాన్ని విస్మరించకూడదు.ఆర్టిస్టులు ఉంటారు.వాళ్లెక్కడికీ వెళ్లరు. నటించే తీరు సంబంధిత కాలం అన్నవే మారుతాయి.వీటితో పాటు సమంత ఎదిగారు..మారిపోయారు..మారిపోయి మరో మంచి నటిగా అవతరించేందుకు సాహసం కూడా చేస్తున్నారు.
సుదీర్ఘ కాలం ప్రయాణం.12 ఏళ్ల ప్రయాణం.ఒక హీరోయిన్ ఊహించని ప్రయాణం.ఊహించేందుకే కాదు అసలు వాస్తవంలోకి వాటిని తీసుకువచ్చేందుకు కూడా కష్టంతో కూడిన ప్రయాణం..12ఏళ్ల ప్రయాణం. సమంత ఇప్పుడు ఈ మలుపులో ఉన్నారు. లైట్స్.. కెమెరా..యాక్షన్ అనే మూడు పదాలతో విడదీయని బంధం ఆ ప్రయాణంలో ఓ భాగం.సమంత ఇప్పుడు పెద్ద చిత్రాలలో నటిస్తున్న నాయకి.ఇంకా సుదూర తీరాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న నాయకి.కొంత అమాయకం,కొంత గడుసుతనం రెండూ తన జీవితంలో కలిసి ఉన్నాయి.కలగలిపి ఉన్నాయి.వాటికి ప్రతీక సమంత.