ET సినిమాతో మరో హిట్ సూర్య అందుకోబోతున్నాడ..?
ఇప్పటివరకు ఈటి సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించాయి.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక పాటను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పాట కూడా ప్రేక్షకులను మెప్పించే లా కనిపిస్తుంది. సూర్య విభిన్నమైన సినిమా పాత్రలకు పెట్టింది పేరు. ఇక ఈ సినిమాలో కూడా మూడు పాత్రలతో కనిపించబోతున్నట్లు సమాచారం. సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇది సూర్య కెరీర్లు 40 వ సినిమాగా తెరకెక్కించడం జరిగింది.
ఈ సినిమాకి డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తుస్తున్నట్లుగా డైరెక్టర్ పాండిరాజ్ తెలియజేశారు. ఇక ఈ చిత్రంలో సూర్య ఒక మాస్ గెటప్‌లో కనిపించనున్నారు. ఇందులో సూర్య తో పాటుగా సత్యరాజ్, జయ ప్రకాష్ , ఎమ్మెస్ భాస్కర్ ఇతరుల సైతం ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇక మార్చి 11వ తేదీన ప్రభాస్ మూవీ విడుదల కాబోతున్న గా ఈ సినిమా కంటే ఒకరోజు ముందుగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు తెలుస్తోంది.. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.