విజయ్ బీస్ట్ సినిమాలో.. మినీ విజయ్ సేతుపతి?
అయితే స్టార్ హీరో విజయ్ సేతుపతి మరో స్టార్ హీరో అయిన ఇళయదళపతి హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో విలన్ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. తనదైన విలనిజంతో విమర్శకుల ప్రశంసలు సైతం గెలుకున్నాడు విజయ్ సేతుపతి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనేసరికి అటు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పెరిగిపోయాయి ఇక అంచనాలకు మించి మాస్టర్ సినిమా విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే.అయితే మాస్టర్ లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్ బీస్ట్ అనే సినిమాను చేస్తున్నాడు అనే విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు మరో ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ సినిమాలో విజయ్ సేతుపతి నటించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ఈ సారి మనకు తెలిసిన విజయ్ సేతుపతి కాదు మనకు తెలియని మినీ విజయ్ సేతుపతి. విజయ్ కుమారుడు సూర్య సేతుపతి నటించిన నానుమ్ రౌడీ దాన్ లో చిన్నప్పటి విజయ్ సేతుపతి గా కలిసి నటించబోతున్నాడు. ఇక ఆయన కుమార్తె శ్రీజ సేతుపతి తండ్రితో కలిసి వెబ్స్ మూవీ లో కూడా నటించడం గమనార్హం. ఇప్పుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్యా ఏకంగా ఇళయ దళపతి విజయ్ రాబోయే చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడూ. దీంతో ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి కుమారుడు పాత్ర ఎలా ఉండబోతుందో అనే దాని పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.