ఫాన్స్ చేతుల మీదుగా మారన్ మూవీ ట్రైలర్ రిలీజ్..!!
హీరో ధనుష్ కథానాయకుడిగా యాక్టింగ్ చేస్తున్న చిత్రం మారన్ ఈ సినిమాకి కార్తీక్ నరేన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సినిమాని సత్య జ్యోతి ఫిలిమ్ బ్యానర్ పై నిర్మించారు. ధనుష్ సరసన హీరోయిన్గా మాళవిక మోహన్ నటిస్తోంది. ఇక ఇందులో మరొక నటులు సముద్రఖని, అమీర్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీరితో పాటుగా ఎంతోమంది నటీనటులు నటిస్తున్నారట. ఇక సంగీతాన్ని ఈ సినిమాకి జీవి ప్రకాష్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ లు వస్తూ ఉండటంతో సినిమాపై అభిమానులు భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా వచ్చే నెల ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలకు సిద్ధంగా ఉన్నది.
ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ను ఈనెల 28న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ ట్రైలర్ ను అభిమానులే విడుదల చేస్తున్నట్లుగా డిస్నీ హాట్ స్టార్ తెలియజేయడం జరిగింది. మొదటిసారిగా అభిమానులు చేతులతో ఇలా ట్రైలర్ విడుదల చేయడం జరుగుతోంది హీరో ధనుష్. ధనుష్ ప్రస్తుతం తెలుగులో కూడా డైరెక్ట్ గా ఒక సినిమాని చేస్తున్నారు. ఇక ధనుష్ తన భార్య ఐశ్వర్య తో విడాకులు ప్రకటన చేసినప్పటి నుంచి పలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.