పూరీ 'జనగణమన' సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే. !

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ లో గ్యాప్ లేకుండా కుమ్మేయబోతున్నారు పూరీ-విజయ్ దేవరకొండ. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో లైగర్ అనే భారీ పాన్ ఇండియా  ప్రాజెక్ట్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమాని విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని పూరి జగన్నాథ్, చార్మి లతో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఇదిలా ఉంటె లైగర్ తర్వాత తమ నెక్ట్స్  ప్రాజెక్ట్ కు కూడా లైన్ క్లియర్ చేశారు.లైగర్ తర్వాత మరోసారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో  సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. గతంలో మహేష్ బాబుతో తెరకెక్కించాలనుకున్న 'జనగణమన' సినిమాని రౌడీ హీరోతో తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్. కాగా అప్పుడో.. ఎప్పుడో కాదు ఈ ఏప్రిల్ నుంచే జనగణమన గ్రాండ్ గా సెట్స్ పై కెళ్లబోతుంది.ఇకపోతే ఏప్రిల్ నుంచే జనగణమన పాడబోతున్నారు పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ.కాగా త్వరలోనే అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించి ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లాలనేది పూరీ ప్లాన్.

ప్రస్తుతం జనగణమన ఫస్ట్ షెడ్యూల్ షూట్ సౌత్ ఆఫ్రికాలో జరుగబోతుంది. ఇక అక్కడి లోకేషన్స్ ను సెర్చ్ చేసే పనిలో ప్రస్తుతం టీమ్ వర్క్ చేస్తోంది. అయితే దానికి సంబంధించిన ఫోటోను కూడా రీసెంట్ గా ఛార్మీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.ఇదిలా ఉండగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న లైగర్.. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే ఆగస్ట్ 25న నేషనల్ వైడ్ లైగర్ రిలీజ్ కాబోతుంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ టైమ్ లో రౌడీబాయ్ తో ఏర్పడిన మంచి ర్యాపో కారణంగా తన నెక్ట్స్ సినిమాను కూడా విజయ్ తోనే ప్లాన్ చేశారు పూరీ జగన్నాథ్. అంతేకాకుండా మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ తో పూరీ చేయాలనుకున్న ప్రాజెక్ట్ జనగణమనను విజయ్ దేవరకొండతో చేయబోతున్నారు. అయితే ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ అంటున్నారు కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: