ప్రస్తుతం పాన్
ఇండియా హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది నేషనల్
క్రష్ రష్మిక మందన్న. ఇటీవలే ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకుంది. గత ఏడాది చివర్లో విడుదలైన ఈ
సినిమా అన్ని భాషల్లో సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప
సినిమా పాన్
ఇండియా రేంజ్ లో విడుదల కాగా.. ఈ సినిమాతో
రష్మిక కు సైతం నేషనల్ వైట్ గా గుర్తింపు వచ్చింది. దీంతో ప్రస్తుతం పాన్
ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో
రష్మిక పేరు ముందు వరుసలో ఉంది.దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈ
బ్యూటీ ఫాలో అవుతున్నట్లుంది.
కాగా ప్రస్తుతం తనకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ బ్యూటీ. అయితే అందుకే
రష్మిక మందన్న తన రెమ్యునరేషన్ పెంచేసింది. తాజాగా 'పుష్ప'
సక్సెస్ తర్వాత
రష్మిక నిర్మాతల నుంచి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని టాక్ నడుస్తోంది.అయితే
రష్మిక 'పుష్ప' రెండవ భాగానికి భారీ రెమ్యునరేషన్ కోరుకోవడమే కాకుండా, ఇతర మేకర్స్ నుండి కూడా అంతే డిమాండ్ చేస్తోందట.ఇకపోతే ముఖ్యంగా ఆమె తన రెమ్యూనరేషన్ తో నెక్స్ట్
మూవీ కోసం సంప్రదించిన మేకర్స్ కు షాక్ ఇచ్చిందట. అంతేకాకుండా
గీతా ఆర్ట్స్ ఉమెన్ సెంట్రిక్
సినిమా చేయమని ఆమెను సంప్రదించినప్పుడు,
రష్మిక భారీ రెమ్యునరేషన్ కోట్ చేసిందని టాక్ నడుస్తోంది
టాలీవుడ్ లో.
అంతేకాదు 'గీత గోవిందం'తో శ్రీవల్లికి పెద్ద బ్రేక్ ఇచ్చింది గీతా క్యాంప్. అయితే అయినప్పటికీ ఆమె తన రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అనడం హాట్ టాపిక్ గా మారింది.ఇకపోతే రష్మిక నిర్మాతల నుంచి జీఎస్టీతో పాటు రూ.2 కోట్లు అడిగినట్లు సమాచారం. ఈ సినిమాకి
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో
రష్మిక మందన యంగ్
హీరో శర్వానంద్ సరసన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో నటించింది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ
సినిమా కొన్ని అనివార్య కారణాల వాయిదా పడింది. ఇక తాజా సమాచారం ప్రకారం
మార్చి 4 న ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!