తగ్గేదేలే అంటున్న ప్రగతి ఆంటీ.. ఈసారి ఏం చేసిందంటే?
అంతే కాదు అప్పుడప్పుడు హాట్ హాట్ డాన్స్ లు కూడా చేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోలు పోస్ట్ చేయడంతో అదికాస్తా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. మరికొన్ని సార్లు జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియోలను కూడా ప్రగతి ఆంటీ అభిమానులు అందరితో సోషల్ మీడియా వేదికగా పెంచుకుంటూ ఉంటుంది. ఇటీవలి కాలంలో ఎంతో మంది హీరోయిన్లు వర్కౌట్లు చేస్తూ ఉన్న వీడియో లను సోషల్ మీడియాలో పెట్టడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్లకు ఎక్కడ తక్కువ కాదు అనుకుందో ఏమో ఇక తాను కూడా అలాంటి ఒక వర్కౌట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది ప్రగతి ఆంటీ.
వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త చక్కర్లు కొడుతోంది. అయితే కాస్త లేటు వయసులో కూడా ప్రగతి ఆంటీ ఎంతో కష్టపడి కసరత్తు చేస్తుండటంతో అందరూ ఫిదా అయిపోతున్నారు మీ డెడికేషన్ కి హాట్సాఫ్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఏదేమైనా ఇక ఇప్పుడు ప్రగతి ఆంటీ పోస్ట్ చేసిన వీడియో మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అనే చెప్పాలి. ఈ వీడియోలో భారీగా వెయిట్ లు ఎత్తుతున్నా ప్రగతి ఫిట్నెస్ కోసం బాగానే కష్టపడుతుంది అని తెలుస్తుంది..