టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్రహీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ సాయి పల్లవి ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ సినిమా సినిమా కి తన పాపులారిటీని పెంచుకుంటుంది అలాంటి ఈ ముద్దుగుమ్మను టాలీవుడ్ దర్శకుడు పొగడ్తలతో ముంచెత్తాడు ఆ వివరాల్లోకి వెళితే.. సాయి పల్లవి ఓ లేడీ పవన్ కళ్యాణ్ అని టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ పేర్కొవడం జరిగింది. అయితే నిన్న అడవాళ్లు మీకు జోహార్లు.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుకుమార్, సాయి పల్ల, కీర్తి సురేష్ తదితరులు హజరయ్యారు.
ఇకపోతే ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. హీరోయిన్ రష్మిక, కీర్తి సురేష్, సమంత, సాయి పల్లవి ఈ నలుగురు ది బెస్ట్ ఫర్ ఫామెన్స్ ఇచ్చే హీరోయిన్లు అని ఆయన వివరించారు. కాగా అందులో సాయి పల్లవి క్రేజ్ చూస్తుంటే.. ఆమె లేడీ పవన్ కళ్యాణ్ లా అనిపిస్తోందని సుకుమార్ చెప్పారు.అంతేకాదు సాయి పల్లవి.. గొప్ప ప్రతిభ, మంచి వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్ అని కొనియాడారు. ఇకపోతే గతంలో ఆమె ఓ వాణిజ్య ప్రకటన తిరస్కరించి.. అందరికీ ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు సుకుమార్. అయితే ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ మంచి విజయం సాధిస్తుందన్నారు.
కాగా ఈ సినిమా పూర్తిగా ఫ్యామీలీ ఎంటరైనర్ అని చెప్పారు. ఇక కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా.. రాధిక శరత్ కుమార్, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇక మార్చి 4న ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు...!!