నా కల నెరవేరింది.. తమన్ ట్విట్ వైరల్?
ఇక ఈ సినిమాలో డానియల్ శేఖర్ పాత్రలో నటించిన దగ్గుబాటి రానా పాత్ర కూడా ఢీ అంటే ఢీ అనే విధంగానే ఉంటుంది. ఇక ఈ సినిమా ఇటీవలే 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసిందే. ఇక మొదటి రోజు నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుంది భీమ్లా నాయక్ సినిమా. ఇక ఇప్పుడు భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించాడు. ఇక ఈ సంగీతం సినిమాకి ప్రాణం పోసిందని అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఈ సినిమాను ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఇక ఈ ప్రత్యేకమైన ప్రదర్శనలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ చిన్నబాబు సంయుక్త మీనన్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సినిమా చూశాడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన థమన్ పవన్ కళ్యాణ్ తో మొదటి సారి సినిమా చూడడంతో ఎంతో సంతోష పడి పోయాడూ. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ సినిమా చూడడంతో నా కల నెరవేరింది అంటూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ చిన్న బాబు సంయుక్త మీనన్ ల తో దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.