మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఈరోజు గుడ్ న్యూస్.. ఏమిటంటే..!!

Divya
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సినీ ఇండస్ట్రీలోకి మహేష్ బాబు ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది.. ఇక ఇప్పటికీ ఎవర్గ్రీన్ హీరోగా తన పేరుని అలాగే పదిలం చేసుకున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు సినిమాలు ఇప్పటివరకు ఎన్నో రికార్డులను సైతం తిరగరాశాయి. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. వాస్తవానికి ఈ చిత్రం కూడా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నది.. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నుండి ఒక అప్డేట్ రానే వచ్చింది వాటి గురించి చూద్దాం.


ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్ మొదటిసారిగా కలిసి నటించబోతున్నారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ కొన్ని రికార్డులను  సృష్టిస్తున్నాయి. ఇక ట్రైలర్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం ఒక మాస్ ఎలిమెంట్స్తో ఉండే విధంగా కనిపిస్తోంది. మహేష్ బాబు ఈ చిత్రంలో సరికొత్తగా చూడవచ్చు అని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు మహాశివరాత్రి కావున చిత్రబృందం ఈ రోజు ఒక అప్ డేట్ ఇవ్వనుంది. శివరాత్రి స్పెషల్ పోస్ట్ ని ఈరోజు 11 గంటల 7 నిమిషాలకు ఒక అప్డేట్ను ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.


ఇక సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి సాంగ్ తెగ వైరల్ గా మారుతోంది. ఇక ఈ సినిమా మే 12వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్లోనే జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా మహేష్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: