భోళా శంకర్ ఫస్ట్ లుక్ అదుర్స్..వీడియోస్ వైరల్..!!
ఇక ఇందులో ఎక్కువగా చెల్లెలు సెంటిమెంట్ ను ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ఇది. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక చిరంజీవి సినిమాల కోసం ఆయన అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ రోజున శివరాత్రి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ వీడియో ని విడుదల చేయడం జరిగింది ఈ చిత్ర బృందం. ఈ ఫోటో వైబ్ ఆఫ్ భోళా గా విడుదల చేయడం జరిగింది.
తాజాగా విడుదలైన పోస్టర్లలో చిరంజీవి న్యూ లుక్ బాగా ఆకట్టుకుంటోంది. ఇక అన్నాచెల్లెళ్ల నేపథ్యంలో సాగు తోంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగును హైదరాబాద్లోనే జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని M.K ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా నటిస్తూ వుండడం గమనార్హం. ఏది ఏమైనా ఈ శివరాత్రికి మెగా అభిమానులకు మంచి ఊరట తెచ్చారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి లుక్ చాలా సాలిడ్ గా ఉందని చెప్పవచ్చు.