బిగ్ బాస్ ఓటిటి.. హౌస్ మెట్స్ టార్గెట్ శ్రీరాపాక?
ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు అన్నింటినీ కూడా కంటస్టెంట్స్ ఆడాల్సి ఉంటుంది. ఇక ఇలా టాస్క్ ల వల్లే కంటెస్టెంట్స్ మధ్య విభేదాలు రావడం ఆ విభేదాలు చివరికి కాంట్రవర్సీ గా మారి పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటస్టెంట్స్ లో ఎవరి నుంచి గుడ్ వైబ్స్ వచ్చాయి. ఎవరి నుంచి బ్యాడ్ వైబ్స్ వచ్చాయి చెప్పాలి అంటూ బిగ్‌బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఇక ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ కూడా తమకు ఎవరూ కనెక్ట్ అవుతున్నారు.. ఎవరూ దూరంగా ఉంటున్నారు అన్న విషయాలను చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఎక్కువమంది కొత్త కంటెస్టెంట్స్ శ్రీరాపాక కు డిస్ లైకులు ఇచ్చేశారు తనకి అస్సలు సింగ్ కావడం లేదని ఓవరాక్షన్ అనడం నచ్చలేదు అంటూ అరియనా డిస్ లైక్ ఇచ్చింది. ఆ తర్వాత ముమైత్‌ఖాన్ కూడా ఎందుకో గుడ్ వైబ్స్ పాస్ రాలేదు అంటూ కారణం చెప్పి డిస్ లైక్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత అఖిల్ నువ్వు నన్ను రా అని పిలువ పోయావని.. నాతో ఫన్ చేయబోయావ్ అది నాకు నచ్చలేదు అంటూ డిస్ లైక్ ఇచ్చేశాడు. ఈ విషయం అడిగినా కూడా అబద్దం చెప్పావు అంటూ అఖిల్ కారణం చెప్పాడు. అఖిల్ చెప్పిన కారణంతో శ్రీ రాపాక ఎమోషనల్ అయింది.
అబద్దం అనేది ఒక పెద్ద లేబుల్ వేసినట్లుగా మారిపోతుందని నిజంగా నేను అబద్ధం చెప్పలేదు అలాంటి మనిషిని కాదు అంటూ బోరున ఏడ్చేసింది. వేరే షో లో జరిగింది గుర్తుపెట్టుకుని ముమైత్ ఖాన్ ఇక్కడ టార్గెట్ చేస్తోందని తోటి హౌస్ మేట్స్ తో చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంది శ్రీ రాపాక. ఇక ఆ తర్వాత వాష్ రూమ్ లోకి వెళ్లి ఏడవడం మొదలు పెట్టింది. ఇక ఇదంతా చూసిన తర్వాత కావాలనే హౌస్ మేట్స్ అందరూ శ్రీ రాపాక ను టార్గెట్ చేస్తున్నారా లేదా ఆటోమేటిక్ గా అలా జరిగిపోతుందా అన్నది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది తెలియాలంటే మరో వారం గడపాల్సిందే..