భీమ్లా నాయక్ : వసూళ్లు ఒకే.. కాని లాభాలు వస్తాయా ?
కేవలం 5.30 కోట్ల షేర్ మాత్రమే నాలుగో రోజు వసూలు చేసింది భీమ్లా నాయక్ సినిమా. ఇక శివరాత్రి హాలీడే కావడంతో 5వ రోజు కచ్చితంగా మళ్లీ కలెక్షన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు ఈ సినిమా బయ్యర్లు. కాని ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా 32 కోట్ల దూరంలోనే. ఒక వారం గట్టిగా వసూళ్లు రాబడితే ఈ సినిమా సేఫ్ అవుతుంది. లేదంటే నష్టాలు తప్పవు.ఇక నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. మరి భీమ్లా నాయక్ సినిమా కు 4 రోజుల్లో వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎంతో ఓ సారి చూద్దాం..
నైజాంలో 28.24 కోట్లు
సీడెడ్లో 7.74 కోట్లు
ఉత్తరాంధ్రలో 5.37 కోట్లు
ఈస్ట్లో 3.95 కోట్లు
వెస్ట్లో 4.12 కోట్లు
గుంటూరులో 4.22 కోట్లు
కృష్ణాలో 2.63 కోట్లు
నెల్లూరులో 1.98 కోట్లు
ఏపీ ఇంకా తెలంగాణ 4 డేస్ కలెక్షన్స్: 58.25 కోట్లు
రెస్టాఫ్ ఇండియా ఇంకా కర్ణాటకలో 6.65 కోట్లు
ఓవర్సీస్లో 10.31 కోట్లు
ఇప్పటిదాకా టోటల్ వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్: 75.21 కోట్లు (120 కోట్లు గ్రాస్)
ఇక భీమ్లా నాయక్ సినిమాకు టోటల్ గా రూ.106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ సినిమా 4 రోజుల్లో 75 కోట్ల మార్క్ అందుకుంది. అయితే మరో 32 కోట్లు వసూలు చేస్తే కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వదు. ఏది ఏమైనా ఒక వారం గడిస్తే గాని ఈ సినిమా హిట్టా ఫట్టా అని చెప్పలేము.