విడాకుల తర్వాత.. మళ్లీ ఒకే చోటకు చేరిన ధనుష్ ఐశ్వర్య?
ఇక విడాకుల ప్రకటన చేసిన తర్వాత ఒకవైపు ఐశ్వర్య మరోవైపు ధనుష్ కూడా వారి వారి కెరీర్లో ఎంతో బిజీగా మారిపోయారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ధనుష్ ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా దర్శకత్వంలో అనుభవం ఉన్న ఐశ్వర్య కూడా తదుపరి ప్రాజెక్టుకు సంబంధించి పనులలో బిజీబిజీగా ఉంది. అయితే ఇక వీరిద్దరిని కలపడానికి ఇద్దరి తరపు బంధువులు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా కుదరలేదు అన్న టాక్ కూడా అప్పట్లో వినిపించింది. కాగా ప్రస్తుతం ధనుష్ సార్ అనే ఓ చిత్రంలో నటిస్తున్నాడు. షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. దీంతో కొన్ని రోజుల నుంచి భాగ్యనగరం లోనే బస చేస్తున్నాడూ ధనుష్.
ఇక్కడే ఒక సాంగ్ షూటింగ్ లో ఉన్న ఐశ్వర్య ధనుష్ ఉంటున్న హోటల్ లోనే ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇకపోతే ఇప్పుడు ఐశ్వర్య ధనుష్ మళ్లీ ఒకే చోట కు చేరుకున్నారు. ఐశ్వర్య ధనుష్ లకు కామన్ ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తి పార్టీ ఇవ్వగా.. ఈ పార్టీకి హాజరయ్యారు ఈ ఇద్దరు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హోటల్లో గ్రాండ్గా పార్టీ జరగ్గా.. పార్టీకి వచ్చిన ధనుష్ ఐశ్వర్య మాట్లాడుకుంటారు ఏమో అని అక్కడున్న వారందరూ ఎదురుచూసారట. కానీ కనీసం మాట వరసకైనా ఒకరినొకరు పలకరించుకోలేదని తెలుస్తుంది. ఇక దీన్ని బట్టి వీరిద్దరూ కలుస్తారు అన్న వార్తలు నిజమా కాదా అన్న చర్చ మొదలయింది.