మలయాళ హిట్ సినిమాపై కన్నేసిన నాగార్జున..?

Anilkumar
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ఫుల్ బిజీగా మారిపోయాడు. ఒకవైపు రియాలిటీ షో లు మరోవైపు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా దూసుకుపోతున్నాడు ఈ సీనియర్ హీరో.యువ హీరోలకు ధీటుగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు నాగార్జున. ఇటీవల 'బంగార్రాజు' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం తాను హిందీలో నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు రెడీగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నాగ్ కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది గోస్ట్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకి కి చేరుకుంది.


అయితే ఈ సినిమాలు ఇంకా విడుదల కాకముందే మరో సినిమాను పట్టాలు ఎక్కించే పనిలో పడ్డాడు నాగార్జున. మెగాస్టార్ చిరంజీవి తో గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తున్న తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న 'బ్రో డాడీ' అనే సినిమాకి రీమేక్ గా ఈ ప్రాజెక్టు తెరకెక్కనున్నట్లు సమాచారం. అంతేకాదు ఇదే సినిమాలో నాగార్జున తో పాటు అతని కొడుకు అఖిల్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నాగార్జున నటించిన చిత్రాల్లో ఎక్కువగా నాగ చైతన్య మాత్రమే నటించాడు.


కానీ అఖిల్ ఒక మనం సినిమాలో మాత్రమే కనిపించాడు. అందులో కూడా అఖిల్ ది గెస్ట్ రోల్ మాత్రమే. కానీ ఇప్పుడు ఈ మలయాళ రీమేక్ లో అఖిల్ ఫుల్ లెన్త్ పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది నాగార్జున కెరీర్లో వందో చిత్రం కావడం. అందుకే ఈ ప్రాజెక్టు విషయంలో నాగార్జున ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం వినిపిస్తున్న ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: