రాధేశ్యామ్ ప్రమోషన్స్ : పూజ హెగ్డే ఇంట్రస్ట్ చూపించట్లేదా..?

Purushottham Vinay
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వింటేజ్ లవ్ స్టోరీ `రాధేశ్యామ్`. రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి దాదాపు మూడు సంవత్సరాల తరువాత వస్తున్న సినిమా కావడం ఇంకా అలాగే దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలు అనేవి ప్రేక్షకుల్లో ఏర్పడ్డాయి.ఇక `సాహో` సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచినా కాని కొన్ని వర్గాలని మాత్రం సినిమా సాటిస్ఫై చేయలేకపోయింది. దీంతో ఆ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఊహలకందని స్టోరీతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయాలన్న పట్టుదలతో రెబల్ స్టార్ చేసిన ప్రయత్నమే ఈ `రాధేశ్యామ్`.గత కొంత కాలంగా నుంచి కూడా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 11న వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మూవీ రిలీజ్ ట్రైలర్ ని విడుదల చెయ్యడం అనేది జరిగింది.


ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ట్రైలర్ ని విడుదల చేయడం అనేది జరిగింది. ఒకే సారి ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్ లు రిలీజ్ చేశారు..ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్ లోని ఆ విజువల్స్ ఇంకా అలాగే భారీ తనం చూస్తేనే తెలిసిపోయింది.ఇక ఇదిలా వుంటే ఓ షాకింగ్ గాసిప్ తెగ వైరల్ అవుతుంది.ఇక ఈ రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో పూజా హెగ్డే పాల్గొనడం లేదంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. `రాధేశ్యామ్` టీమ్ కూడా పూజా కమిట్మెంట్ ల కారణంగా ప్రమోషన్స్ లో పాల్గొనక పోవచ్చని థింక్ చేశారు.అయినా కాని పూజా తన మిగిలిన సినిమాల మీద చూపించినంత ఇంట్రెస్ట్ ఈ సినిమాపై చూపించట్లేదని రెబల్ స్టార్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆమె పై ఫుల్ కోపంలో వున్నారట. పాన్ ఇండియా సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో నీకు అవకాశం రావడం అనేది నువ్వు చేసుకున్న అదృష్టం.నీ కెరీర్ లోన్ ఈ సినిమా బిగ్గెస్ట్ సినిమా.. అలాంటిది నువ్వు ఈ సినిమాని పట్టించుకోకుండా ప్రమోషన్స్ లో పాల్గొనకపోతే ఏంటి అర్ధం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: