ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లోని స్టార్ హీరోలు ఎక్కువ శాతం పాన్ ఇండియా సినిమా లలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే, అయితే అందులో భాగంగా పాన్ ఇండియా చిత్రాల విడుదల తేదీ విషయం లో కూడా హీరోలు, దర్శక నిర్మాతలు కూడా చాలా ముందు జాగ్రత్త వహిస్తున్నారు, ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు కావడం తో సహజం గానే ఆ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉంటాయ్. అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నా, సినిమా విడుదల తేదీ లను చాలా రోజులు ముందుగా ప్రకటించినట్టు అయితే మిగతా సినిమాలతో పెద్దగా పోటీ ఉండదు, అందు వలన పాన్ ఇండియా సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు ఇలాంటి ప్లాన్ చేస్తున్నారు. అయితే అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ చిత్ర బృందం అలాంటి జాగ్రత్తలే తీసుకుంది, ఆది పురుష్ సినిమాను 12 జనవరి 2023 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తాజాగా ఈ చిత్ర బృందం ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కీయారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాను కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఉద్దేశం లో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ సినిమా లో అంజలి సునీల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ రెండు సినిమా లతో పాటు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచన లో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇలా 2023 సంక్రాంతి ని ఇప్పటి నుండే మన టాలీవుడ్ హీరోలు టార్గెట్ చేస్తున్నారు.