ప్రభాస్ ఇక లాభం లేదనుకున్నాడో ఏమో..!!

P.Nishanth Kumar
10 సంవత్సరాల కాలంలో ప్రభాస్ కేవలం మూడంటే మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. బాహుబలి సినిమా కోసం ఆయన ఏకంగా 5 సంవత్సరాలు వెచ్చించాడు. ఆ తర్వాత సాహో.సినిమా తొందరగానే పూర్తయినా కూడా దాని తర్వాత ఆయన సినిమా చేసే విషయంలో ఎందుకు బాగా ఆలస్యం అయ్యింది. ఏకంగా మూడు సంవత్సరాలు ప్రభాస్ ను వెండితెర మీద చూడలేకపోయారు ఆయన అభిమానులు. అలా ఇప్పుడు మార్చి 11వ తేదీన రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్.

ఇతర హీరోలు ఈ పది సంవత్సరాల వ్యవధిలో పదికి పైగా సినిమాలు చేస్తే ప్రభాస్ మాత్రం కేవలం మూడు సినిమాలకే పరిమితం అయిపోవడం ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. పాన్ ఇండియా స్టార్ అవడమేమో కానీ ఆయన ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాడు అనే విమర్శలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. అయితే ఇకపై తన అభిమానులను ఫుల్ ఖుషి చసేందుకు ప్రభాస్ భారీగా ప్రయత్నాలు చేస్తున్నాడు. 

ఆయన ఒకే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దానికి గాను ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొననున్నాడట. ఈ సంవత్సరం రాధే శ్యామ్ చిత్రాన్ని తీసుకు వస్తున్న ప్రభాస్ ఈ ఏడాది చివరిలో సలార్ చిత్రాన్ని కూడా తీసుకు వస్తున్నాడు వచ్చే ఏడాది ఆది పురుష్ మరియు మారుతి దర్శకత్వంలోని సినిమా తో రానున్నాడు. ఇక సందీప్ వంగా, బాలీవుడ్ దర్శకుడితో కలిసి చేస్తున్న సినిమాలను ఆపై వచ్చే ఏడాది విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడు. మొత్తానికి ప్రభాస్ గతంలోలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఆలోచించడం ఆయన అభిమానులను సంతోష పెడుతుంది. మరి ఈ సినిమాలతో అయన ఎలాంటి సంచలన విజయాలను నమోదు చేస్తాడో చూడాలి. అన్ని కూడా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్స్ కావడం విశేశం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: