వామ్మో: శ్యామ్ సింగరాయ్ కోసం పోటీ పడుతున్న స్టార్ హీరోలు..!!

Divya
హీరో నాని నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రంతో మళ్లీ ట్రాక్ లొకి పడ్డాడు నాని. ఇందులో హీరోయిన్స్ గా కృతి శెట్టి, సాయి పల్లవి కూడా నటించడం జరిగింది. ఇందులో నాని రెండు పాత్రలలో నటించాడు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.. అయితే ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేయడం కంటే.. రీమిక్స్ చేస్తే బాగుంటుందని మరికొందరు మేకర్స్ భావించడంతో ప్రముఖ నిర్మాతలు సైతం ఈ చిత్రం రిమేక్ రైట్స్ ని భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం.
ఎట్టకేలకు శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని బాలీవుడ్ లో తీసేందుకు చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఈ సినిమాను రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రీమేక్ కోసం బాలీవుడ్ కు చెందిన ఇద్దరు బడా హీరోలు పోటీ పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇద్దరు హీరోలు కూడా ఈ చిత్రంపై బాగా ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది.. కానీ ఎవరి డేట్లు డైరెక్టర్ కు అందుతాయి అనే విషయం మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. ఈ సినిమాని హీరో అజయ్ దేవగన్, షాహిద్ కపూర్ లు నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు గా సమాచారం.

అయితే ఈ సినిమాని హీరో నాని మాత్రం షాహిద్ క  పూర్ చేస్తేనే బాగుంటుందని తన మనసులో మాటని తెలియజేశాడు. అలాగే నాని నటించిన జెర్సీ మూవీ ను కూడా సాహిద్ కపూర్ నటించడంతో మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఇలాంటి సమయంలోనే శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని కూడా ఆ హీరో అయితేనే బాగుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ఇంత క్రేజ్ ఏర్పడిందని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. ఈ సినిమా కూడా హిందీ లో మంచి విజయాన్ని అందుకుంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: