షాక్: హీరో అజిత్ రాజకీయా ఎంట్రీపై ఏమన్నాడంటే..!!

Divya
తమిళంలో హీరో అజిత్ కి ఉన్న ఫాలోయింగ్ ను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ హీరో కి అక్కడ ఉండే మాస్ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో.. అంతే స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కూడా ఉందని చెప్పవచ్చు. అందుచేతనే ఎక్కువగా ఈయనని అభిమానులు అభిమానిస్తూ ఉంటారు. కానీ హీరో అజిత్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటూ తనని తాను ప్రూవ్ చూసుకుంటూ వెళుతూ ఉంటాడు. ఇతరుల విషయంలో అస్సలు జోక్యం చేసుకోడు అజిత్.. కేవలం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు.

ఎప్పుడూ తన సినిమాల గురించి మాట్లాడడు.. ఇతర హీరోల సినిమాల వేదిక పై కూడా కనిపించడు అజిత్. ఇండస్ట్రీలో తను కూడా ఒక హీరో అయినప్పటికీ కూడా ఎప్పుడు వివాదాస్పదమైన విషయాలపై స్పందించడు. అంతే కాకుండా బయట కు సంబంధించిన రాజకీయ విషయాలపై కూడా అజిత్ ఏమి మాట్లాడాడు. కేవలం ఎప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి కూడా కాదు అజిత్. ఎవరికైనా ఎలాంటి కష్టం వచ్చినా సరే వెంటనే స్పందిస్తూ ఉంటాడు. ఒకప్పుడు వరదబాధితులకు ఎంతో సహయ సహకారాలు అందించిన వ్యక్తి అజిత్. ఇప్పటి వరకు  షూటింగ్ సమయాలలో, బయట కూడా ఎవరిని కసురు కున్న దాఖలాలు కూడా లేవు.

ఇక ఎవరైనా సెట్లో తనకి గొడుగు పట్టుకొని నిలబడడం ఇష్టం ఉండదు. అంత సింప్లిసిటీ గా ఉంటాడు. రజనీకాంత్ తర్వాతనే ఆ ప్లేస్లో అజిత్ పేరు వినిపిస్తూ వుంటుంది. ఇక ఆయనకు కూడా ఏ పార్టీకి మద్దతు ఇచ్చిన ఆ పార్టీ కచ్చితంగా ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు. అందుచేతనే అక్కడి రాజకీయ నాయకులు కొంత మంది ఆయనని రాజకీయాల్లోకి దింపాలని ఎంతో ప్రయత్నించినా.. ఆయన వాటికి అందకుండా తనపని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు. కేవలం తన సినిమాల విషయం పై మాత్రమే ఫోకస్ పెడుతూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: