తన ఫేవరేట్ హీరోని కలిసిన షణ్ముక్.. ఎమోషనల్?

praveen
షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ ద్వారా ఊహించని రేంజిలో పాపులారిటీ సాధించి ఇక కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇలా సోషల్ మీడియాలో వరుసగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. దీంతో ఎంతగానో సంబరపడిపోయాడు షణ్ముఖ్ జస్వంత్. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత సిరి తో హగ్గులు కిస్సులు అంటూ కాస్త నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ఇక ఇలా సిరి తో మితిమీరిన  ప్రవర్తన కాస్తా వివాదంగా కూడా మారిపోయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు దీప్తి సునైనా బ్రేక్ అప్ చెప్పేసింది.


 ఇక ఇదంతా పక్కన పెడితే ఇటీవలే షణ్ముఖ్ జస్వంత్ ఫేవరెట్ హీరో ని కలిసి ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు. సాధారణంగా అభిమానులు ఎవరైనా తమ ఫేవరేట్ హీరోని కలిసారు అంటే చాలు ఎంతో ఎగ్జైటింగ్ ఫీలవుతూ వుంటారు. ఫేవరెట్ హీరో ని కలవడం అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్  సైతం తన ఫేవరేట్ హీరో సూర్య ని కలిసి ఎమోషనల్ అయ్యాడు. ఇటీవలే సూర్య హీరోగా నటించిన ఈటి సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత తన ఫేవరెట్ హీరో సూర్య ని కలిసిన షణ్ముఖ్ జస్వంత్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మార్చ్ మూడవ తేదీన ఎంతో సంతోషకరమైన రోజు.. కొన్ని నెలలుగా ఎన్నో ఫెయిల్యూర్స్ చూసిన నేను ఇక ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా..  ఈ అవకాశం ఇచ్చిన సుబ్బు మనోజ్ లకు ధన్యవాదాలు.. ఐ లవ్ యు సూర్య అన్న అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని రిలీజ్ చేసాడు షణ్ముఖ్ జస్వంత్. ఇందులో హీరో సూర్య షణ్ముఖ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి మనసారా  హగ్ ఇచ్చాడు. ఈ వీడియో కాస్త వేగంగా వైరల్ గా మారిపోయింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: