భీమ్లా నాయక్ డైరెక్టర్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. హీరో ఎవరంటే..?

Anilkumar
ఇండస్ట్రీకి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన దర్శకుడి తర్వాత సినిమా అంటే అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం అలాంటి ఫేజ్‌లో ఉన్నాడు సాగర్‌ కె.చంద్ర. 'భీమ్లా నాయక్‌' లాంటి విజయం తర్వాత సాగర్‌ చంద్ర సినిమా ఇదే, అదే అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఆ వార్తలకు ఎక్స్‌టెన్షన్‌గా ఓ సినిమా టైటిల్‌ కూడా బయటికి వచ్చింది. అయితే అవును సాగర్‌ చంద్ర కొత్త సినిమా 'టైసన్‌ నాయుడు' అని చెప్పుకుంటున్నారు. ఇకపోతే ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియదు కానీ, పేరు మాత్రం అదిరిపోయింది.అయితే 'టైసన్‌ నాయుడు' ఎవరు అనేది కాసేపు పక్కనపెట్టి.. 'భీమ్లా నాయక్‌' కంటే ముందు సాగర్‌ చంద్ర గురించి మాట్లాడాలి.


ఇక అది ఏంటంటే 'భీమ్లా నాయక్‌' కంటే ముందు సాగర్‌ చంద్ర - వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సింది.అయితే  కథ, నిర్మాత.. ఇలా అన్నీ కుదిరినా ఆ సినమా ముందుకు రాలేదు. ఇకపోతే బడ్జెట్‌ విషయంలో అప్పుడు చర్చలు జరిగి ప్రాజెక్ట్‌ ఆగిపోయిందని టాక్‌.అయితే  దీంతో 'భీమ్లా నాయక్‌' తర్వాత ఆ ప్రాజెక్టే మొదలవుతుంది అనుకున్నారు. ఇక ఇక్కడ లెక్కల మారాయంటున్నారు.ఇక ప్రస్తుతం ఇప్పుడు 'టైసన్‌ నాయుడు' సంగతి చూద్దాం. అయితే ప్రస్తుతం సాగర్‌ చంద్ర దగ్గర రెడీగా రెండు కథలు ఉన్నాయట. ఇకపోతే వాటిలో ఒకటి గతంలో వరుణ్‌తేజ్‌ గురించి అనుకున్నది. అయితే ఆ సినిమా హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌ అని సమాచారం.


కాగా రెండో సినిమా పూర్తి కమర్షియల్‌ స్టోరీ అట. అయితే దాని పేరే 'టైసన్‌ నాయుడు' అని సమాచారం.ఇకపోతే  ఈ కథను ఇప్పటికే సాగర్‌ చంద్ర ఇద్దరు హీరోలకు వినిపించాడని అంటున్నారు. ఇక సాగర్‌ చంద్ర ఇప్పటికే ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌తో డీల్‌ చేసుకున్నాడు. ఇక నెక్స్ట్‌ సినిమా ఆ బ్యానర్‌లోనే ఉండొచ్చు అని టాక్‌.ఇక సాగర్‌ చంద్ర కథ పాయింట్‌ చెప్పిన హీరోలు ఎవరు అనే విషయం పూర్తిగా తెలియకపోయినా. అయితే ఆ సినిమా కథ రామ్ లేదా నానిలో ఒకరికి 'టైసన్‌ నాయుడు' కథ సూటవుతుందని అంటున్నారు. ఇకపోతే 'టైసన్‌ నాయుడు' ఇప్పుడు బయటకు వస్తాడా? లేదా  వేరే ఇంకేదైనా కథను ముందుకు తీసుకొస్తాడా అనేది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: