త్రిష వివాహం చేసుకోబోయేది అతడీనేనా..?
హీరోయిన్ త్రిష ఒక బిజినెస్ మేన్ తో ఏడు అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉంది అన్నట్లూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఆమె అప్పుడప్పుడు న్యూయార్కు వెళుతోంది అన్నట్లుగా వార్తలు మీడియా వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక అక్కడ ఉండే ఒక దిగ్గజ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతోంది అన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పై అభిమానులకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు త్రిష. అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ పరిశ్రమలోనే అగ్ర హీరోలందరితో నటించింది త్రిష. ఈమె హీరోయిన్ గా కాకుండా మోడలింగ్ గా కూడా చేసిందట. ఫేర్ అండ్ లవ్లీ యాడ్ లో నటించి ఎన్నో అవకాశాలను దక్కించుకుంది. అయితే గతంలో కూడా పలువురు హీరో లతో ఈమె ప్రేమలో పడినట్లుగా కూడా వార్తలు వినిపించాయి.
అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఇలాంటి వార్త బయటకు రావడంతో ఈ వార్త కూడా నిజమో లేకపోతే ఒట్టి పుకార్లు గానే ఉంటుందో చూడాలి మరి. దీంతో సినీ ఇండస్ట్రీలో మరొకసారి త్రిష గురించి హాట్ టాపిక్ గా మారిపోయింది. కానీ ప్రస్తుతం త్రిష మళ్లీ న్యూ ఇయర్ కి వెళ్ళింది అని ఖచ్చితంగా ఈ సారి అక్కడున్న దిగ్గజ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటుంది అని గట్టిగా వార్తలు వినిపించడంతో ఆమె నిజంగానే పెళ్లి చేసుకోబోతోంది అని అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తమిళ్ సినిమాలో హీరోయిన్గా మాత్రమే కాదు పోస్ట్ పాత్రలలో కూడా ప్రేక్షకులను అలరించింది త్రిష.