తెలుగు సినిమా ఇండస్ట్రీలో
రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు.. అంతేకాకుండా పలు వాణిజ్య ఉత్పత్తుల బ్రాండ్స్ పై కూడా అంబాసిడర్ గా చేస్తున్నారు. ఇప్పటివరకు పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన
రామ్ చరణ్ తాజాగా మరొక సరికొత్త బ్రాండ్ కలిగిన ఉత్పత్తికి ప్రచారం చేయనున్నాడు. ప్రముఖ పానీయాల ఉత్పత్తి కంపెనీ సంస్థ అయిన పార్లే ఆగ్రో సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఒక జ్యూస్
ఫ్రూట్ కి
రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు.
ఇక
రామ్ చరణ్ తో పాటు
rrr ఫేమ్
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా కలిసి ఈ బ్రాండ్ అంబాసిడర్ ప్రమోషన్ చేసింది. భారత బేవరేజెస్ ఉత్పత్తిలో అగ్రగామిగా పొందిన సంస్థ ఆగ్రో. ఈ
ఫ్రూట్ కి
హీరోయిన్ అలియా భట్ ప్రచారకర్తగా ఇదివరకే ఉండేదట. ఇక దీంతో
రామ్ చరణ్ కూడా తోడవడంతో వీరిద్దరు కలిసి బ్రాండ్ అంబాసిడర్ గా ఈ
ఫ్రూట్ జ్యూస్ వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించి నిన్నటి రోజున ఆ సంస్థ అధికార ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే పార్లే లో కొన్ని బ్రాండ్ అంబాసిడర్ లకు
ప్రియాంక చోప్రా,
అర్జున్ కపూర్,
వరుణ్ ధావన్ ఉన్నారు.ఇక ప్రస్తుతం
రామ్ చరణ్ కూడా వీరి ఖాతాలోకి చేరుకున్నాడు.
రెండు సంవత్సరాల తర్వాత తాము యాక్షన్ ఫ్యాక్ట్ సమ్మర్ లోకి ప్రవేశిస్తున్నమని పార్లే ఆగ్రో సంస్థ జాయింట్ మేనేజర్, C.M.O. నదియా చౌహన్ తెలియజేశారు. ఇక ఈ సీజన్ సరికొత్త గా ఉండాలని..
రామ్ చరణ్,
ఆలియా భట్ తో ప్రారంభించామని తెలిపారు. ఇక వీరికి ప్రజలలో ఉన్న ఆకర్షణ కి అదనపు తోడు మా ఫ్రూటీ జ్యూస్ అందిస్తుందని తెలియజేశారు. ఇక అలాగే
హీరో హీరోయిన్లకు తమ పార్లే ఆగ్రో కుటుంబంలో భాగమైనందుకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఇక తమ బ్రాండ్ అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆ సంస్థ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.