'రాధే శ్యామ్' కథని రిజెక్ట్ చేసిన వెంకటేష్.. అసలేం జరిగిందంటే..?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఇక ఈ సినిమా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానీ ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్రబృందం. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన రెండవ ట్రైలర్ ఇటీవలే విడుదల కావడం జరిగింది ట్రైలర్ విడుదల అనంతరం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగి పోయాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు రావడం జరిగింది. ఇకపోతే ఈ చిత్రంలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే  ఈ చిత్ర కథ రాసింది దర్శకుడు రాధాకృష్ణ కాదట.


కాగా విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ కథని రాసుకున్నారట.ఇకపోతే చంద్రశేఖర్ ఏలేటి ముందుగా ఈ కథని హస్తసాముద్రిక నిపుణుడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కోణంలో రాసుకున్నారట.తాజాగా  ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ లో ఉన్నత రొమాంటిక్, లవ్ పార్ట్ ముందుగా కథలో లేదు.అయితే  ఆ కథని చంద్రశేఖర్ యేలేటి విక్టరీ వెంకటేష్ కు వినిపించారట. కాగా సెకండ్ హాఫ్ నచ్చలేదని వెంకీ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఇక దీనితో చంద్రశేఖర్ యేలేటికి కూడా ఈ కథపై ఆసక్తి పోయిందట. అయితే దీనితో ఈ కథని ఆయన అమ్మేశారు.


కాగా ఆ తర్వాతే దర్శకుడు రాధాకృష్ణ చేతుల్లోకి వచ్చింది.అయితే  రాధాకృష్ణ ఈ కథకు మరిన్ని మార్పులు చేర్పులు చేసి రొమాంటిక్ పార్ట్ పెంచారు. కాగా ప్రభాస్ కి తగ్గట్లుగా స్టోరీని బిల్డ్ చేశారట. అలా రాధే శ్యామ్ కథ రూపు దిద్దుకున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే రాధే శ్యామ్ చిత్రంలో ప్రభాస్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హస్తసాముద్రిగా నిపుణుడిగా నటిస్తున్నారు. అయితే చేతి రేఖల్ని బట్టి ఎంతటి వారి భవిష్యత్తునైనా చెప్పేయగలడు. ఇక అలాంటి వ్యక్తి లైఫ్ లో ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేదే రాధే శ్యామ్ చిత్ర కథ...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: