టాలీవుడ్ స్టార్
హీరో యంగ్ టైగర్
ఎన్టీఆర్ వెండితెరపై కనిపించి చాలా కాలం అయింది. నందమూరి అభిమానులు
ఎన్టీఆర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎన్టీఆర్ గతంలో నటించిన ‘అరవిందసమేత వీరరాఘవ’
సినిమా వచ్చి మూడున్నరేళ్లు దాటింది. ఈ
సినిమా తరువాత ఇప్పటివరకూ
ఎన్టీఆర్ నుంచి మరో
సినిమా రాలేదు. దీంతో ఆయన అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. అయితే అరవింద తర్వాత
తారక్ ట్రిపుల్ ఆర్ పైనే ఫోకస్ మొత్తం పెట్టడం జరిగింది. ఇకపోతే ఇప్పటికే ట్రిపుల్ఆర్
సినిమా ఐదు సార్లు వాయిదా పడింది.కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈయన నుంచి
సినిమా ఎప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే
సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. అయితే అభిమానుల నిరీక్షణకు ఫలితంగా
మార్చి 25న ట్రిపుల్ ఆర్ గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే .ఇకపోతే దాంతో అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక ఇదిలా ఉంటె దర్శక దిగ్గజం ఎస్ఎస్
రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో
రామ్ చరణ్ మరో ప్రధాన పాత్రలో నటించడం జరిగింది.ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అమెరికాలో ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా బుకింగ్స్ సేల్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి.
ప్రస్తుతం తాజాగా అమెకారిలోని డల్లాస్ నగరంలోని గెలాక్సీ థియేటర్లో
ఎన్టీఆర్ వీరాభిమాని ఏకంగా 75 టికేట్లను కొనుగోలు చేశాడు. ఇలా దీన్ని బట్టి చూస్తే
తారక్ అభిమానులు ఈ
సినిమా గురించి ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. ఇకపోతే డివివి ఎంటర్టైనమెంట్స్ పతాకం పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇక ఈ సినిమాలో ఆలియాభట్, ఒలీవియా మొర్రిస్‌లు హీరోయిన్‌లుగా నటించారు. వీరితో పాటుగా అజయ్‌దేవగన్, శ్రియ,
సముద్రఖని కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎమ్ఎమ్
కీరవాణి సంగీతం అందించాడు....!!