రాధేశ్యామ్ డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా?

Satvika

పాన్ ఇండియా స్టార్ హీరో డార్లింగ్ ప్రభాస్, టాలివుడ్ లక్కీ గర్ల్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్..అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజిగా వుంది.. దేశంలోని ప్రముఖ నగరాల్లో సినిమా ప్రీరిలిజ్ ఈవెంట్ లను నిర్వహించి సినిమా పై అంచనాలను పెంచుతున్నారు.. మొన్న ముంబాయి లో ఈవెంట్ ను నిర్వహించిన చిత్రయూనిట్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా చెన్నైలో ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా డార్లింగ్ మాట్లాడిన మాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 



అందుకు సంబంధించిన వీడియో లు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్స్, ట్రైలర్లు సినిమా పైన భారీ అంచనాలను నమోదు చేశాయి. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడో ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చెస్తుంది.



‘రాధేశ్యామ్’ చిత్రానికి 300కోట్ల బడ్జెట్ అయ్యిందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ కూడా భారీగా డీల్ కుదిరిందని సమాచారం. రాధేశ్యామ్ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ సంస్థ అన్ని భాషలకు కలిపి దాదాపు 150కోట్ల భారీ ధరకు తీసుకున్నారని సమాచారం. ఇకపోతే హైదరాబాద్ లో మామూలు థియెటర్లలో 175 రూపాయలు, మల్టీ ఫ్లెక్స్ లో 295 రూపాయలు టిక్కెట్ ధరలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ జరగనుందట. గోపి కృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రశీదలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు ముందే మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా మార్చి 11 న ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: