ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో వెంకి మామ సేఫ్..!!

Divya
గత కొంతకాలం నుంచి ఎక్కువగా ఒక హీరో సినిమాలు మరొక హీరో కి వెళ్లడం సర్వసాధారణంగా మారింది. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచగా మరికొన్ని సినిమాలు చేదు అనుభవాలను మిగిల్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఒక సీనియర్ హీరో చేయవలసిన సినిమాని ఒక యువ హీరో చేయడం జరిగింది. ఆ చిత్రమే ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఈసినిమాలో హీరో శర్వానంద్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా నటించాడు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి హైప్ ను క్రియేట్ చేసుకున్నప్పటికీ థియేటర్లో వచ్చేసరికి డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది.


అయితే ఎన్నో రోజుల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఏ హీరో అలరించలేకపోతున్నారు.. అందుచేతనే చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామ ని డైరెక్టర్ కిషోర్ తిరుమల తెలియజేశారు. అయితే ఆయన చేసిన ఈ ప్రయత్నం అంతగా ఫలించ లేనట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంపై శర్వానంద్ కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నాడు.. కానీ ఈ చిత్రని కి కూడా డివైడ్ టాక్ ఎదురైందని సమాచారం. అయితే ఇదంతా ఇలా ఉండగా మరొక ఆశక్తికరమైన విషయం ఫిలిం ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకి పెట్టింది పేరు వెంకటేష్.. ఇక శర్వానంద్ నటించిన ఈ చిత్రాన్ని హీరో వెంకటేష్ నటించిన ఉంటే ఎలా ఉంటుందో అని ఇండస్ట్రీ వర్గాలవారు అనుకుంటున్నారు. అయితే ముందుగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ తిరుమల వెంకటేష్ తోనే చేయాలనుకుంటున్నారట. ఇందులో నిత్యామీనన్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ వెంకటేష్  ఇదివరకే మల్లేశ్వరి సినిమాలో పెళ్లి కాని ప్రసాద్ పాత్రలో  నటించడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.. ఇక అలాంటి కథకి కాస్త మార్పులు చేసి డైరెక్టర్ కిషోర్ తిరుమల చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: