నాగార్జున 'ఘోస్ట్' మరి ఇంత స్లోనా..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ నాగార్జునసంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయిన బంగార్రాజు సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు,  బంగార్రాజు సినిమా కంటే ముందు నాగార్జున వరుస పరాజయా లతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయి ఉన్నాడు,  అలాంటి సందర్భం లో విడుదలయిన బంగార్రాజు సినిమా నాగార్జున కు బాక్స్ ఆఫీస్ మంచి విజయాన్ని అందించిన మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ కింగ్ నాగార్జున 'బంగార్రాజు'  సినిమా కంటే ముందే గరుడ వేగ సినిమా తో మంచి విజయం అందుకున్న ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో  ఘోస్ట్ మూవీ ని మొదలు పెట్టాడు,  ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తయిన తర్వాత బంగార్రాజు సినిమాను నాగార్జున మొదలు పెట్టి పూర్తి చేశాడు,  కాక పోతే ఇప్పటి వరకు సినిమా నుండి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను మినహాయిస్తే ఎలాంటి అప్డేట్ లో కూడా పెద్దగా బయటకు రాలేదు.


  మొదట ఘోస్ట్ సినిమాలో కాజల్ అగర్వాల్ ను చిత్ర బృందం హీరోయిన్ గా ఎంపిక చేసుకుంది, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి కాజల్ అగర్వాల్ తప్పుకుంది.  అయితే ఆ తర్వాత అమలా పాల్ ను ఘోస్ట్ చిత్ర బృందం హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి,  ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటి వరకు  చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఇలా  బంగార్రాజు సినిమా కంటే ముందు మొదలైన ఘోస్ట్ సినిమా చాలా స్లో గా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది,  ఇది ఇలా ఉంటే నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ 'ఓ టి టి' కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: