రౌడీ హీరో నెక్స్ట్ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?

Anilkumar
“టక్ జగదీష్” ఫేమ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా షూటింగ్ పూర్తి చేయడం జరిగింది.అయితే విజయ్ ఇప్పుడు మళ్లీ పూరి జగన్నాధ్‌తో “జనగణమన” అనే మరో భారీ పాన్ ఇండియా సినిమాకు సిద్ధమయ్యాడు. ఇకపోతే విజయ్ ఏకకాలంలో పూరీతో పాటు శివ నిర్వాణ చిత్రాన్ని కూడా పూర్తి చేయబోతున్నాడట. పోగా విజయ్, శివ నిర్వాణం ప్రాజెక్ట్ పై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాగా రూమర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.


అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం  ఈ చిత్రానికి సంగీతం అందించడానికి స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకోవాలని శివ నిర్వాణ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇకపోతే గతంలో ఈ దర్శకుడు సంగీత దర్శకులు గోపీ సుందర్, తమన్‌లతో కలిసి పని చేశారు. అయితే ఇక ఇప్పుడు వస్తున్న వార్తలు నిజమైతే శివ నిర్వాణం, అనిరుద్ కలిసి చేయబోతున్న మొదటి సినిమా ఇదే అవుతుంది. ఇకపోతే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ లో సౌత్ సైరన్ సమంత విజయ్‌తో రొమాన్స్ చేయనుందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇక త్వరలోనే చిత్రాన్ని వీటన్నింటిపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పూరి జగన్నాథ్, చార్మి తో కలిసి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: