స్టార్ హీరో అక్కినేని నాగార్జున అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కింగ్ లాగా దూసుకుపోతున్నాడు. ఇక ఏదైనా ఉంటే 2000 వ సంవత్సరంలో అక్కినేని నాగార్జున ఏకంగా ఆరు సినిమా లో రిలీజ్ చేయడం జరిగింది.నిన్నే ప్రేమిస్తా, అధిపతిలాంటి గెస్ట్ అప్పియరెన్స్ సినిమాలు హిట్ సాధించగా, ఇక ఆ తరువాత తరువాత వ నువ్వు వస్తావని సినిమా కూడా హిట్ సాధించింది. కాగా ఆ తరువాత వచ్చిన ఎదురులేని మనిషి, బావ నచ్చాడు, ఆకాశ వీధుల్లో, స్నేహమంటే ఇదేరా సినిమాలు వరుసగా ఘోరమైన అపజయాలు మూటగట్టుకున్నాయి. అయితే ఆ తరువాత వెంటవెంటనే సంతోషం, మన్మధుడు, శివమణి, నేనున్నాను సినిమాలతో సక్సెస్ బాట పట్టాడు.
ఇక అదే సమయంలో రాఘవ లారెన్స్ తన దగ్గర కథ ఉందని, తాను డైరెక్టర్ కావాలని అనుకుంటున్నానని చెప్పడంతో కథ చెప్పమని అడిగాడు నాగ్. ఇక దీంతో కథ చెప్పడం మొదలు పెట్టాడు రాఘవ. అయితే సినిమా ఎలా తీయాలని అనుకుంటున్నాడో కళ్ళకు కట్టినట్టు వివరించాడు. కాగా దీంతో రాఘవ కథను మెచ్చిన నాగ్.. అక్కడిక్కడే తన సొంత నిర్మాణ సంస్థలో రాఘవతో తన తరువాతి సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఆ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించడం జరిగింది. పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు.ఇక అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న శ్యామ్ కే నాయుడుని కెమెరామెన్‌గా, ఛార్మి, జ్యోతికలకు హీరోయిన్లుగా, సునీల్, వేణుమాధవ్ లాంటి కామిడీయనట్లు తీసుకొని సినిమా మొదలు పెట్టారు. అయితే అంతా అనుకున్నట్టు సినిమా పూర్తి చేశారు.
ఇక ఆ సినిమాకు 'మాస్' అని టైటిల్ పెట్టారు. కఇకపోతే కట్ చేస్తే సినిమా రిలీజ్, అసలే మాస్ అని టైటిల్ పెట్టడంతో ఎలా ఉంటుందో అన్న ఆతృతతో సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ టాక్‌తో బయటికి వచ్చారు.అయితే దీంతో రాఘవలోని దర్శకుడికి మంచి మార్కులు పడడంతో పాటు, నాగార్జున నిర్మాతగానూ, హీరోగానూ మంచి విజయాలు అందుకున్నాడు. ఇక ఆరు పదుల వయసులోనూ నాగార్జున తన మార్కెట్ తగ్గిపోకుండా సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‌గా 'బంగార్రాజు' సినిమాను విడుదల చేసి హిట్ అందుకున్నాడు నాగార్జున...!!