ఆపదలో ఆదుకొనే టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే..!!

Purushottham Vinay
టాలీవుడ్ లో మన హీరోలు కేవలం సినిమాలే కాదు సేవా కార్య క్రమాలు కూడా బాగా చేస్తారు. అలా సమాజ సేవ చేసే వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఎవరి పేరు అంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. చిరు కేవలం ఇప్పుడు కాదు దశాబ్దాల కాలం నాటి నుండి ప్రజలకు తన వంతు సాయం అందిస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ ఇంకా ఐ బ్యాంక్ లతో చిరు తన సేవలను కొనసాగిస్తున్నాడు. కరోనా మహమ్మారి సమయంలో ఆక్సిజెన్ బ్యాంక్ స్థాపించి సేవలను కూడా చేసారు...ఇక కరోనా వచ్చిన సమయంలో లాక్ డౌన్ పెట్టగా ఆ లాక్ డౌన్ లో చిక్కుకున్న వలస కూలీలకు దేవుడిలా మారాడు రియల్ హీరో సోనూ సూద్. కష్టాల్లో వున్న వారికి అండగా నేనున్నానని చెప్పిన గొప్ప మనుసు ఉన్న వ్యక్తి ఎవరంటే దేశం మొత్తం కూడా ఖచ్చితంగా  సోనూసూద్ పేరే చెప్పిద్ది. ఈయన ఎంతో మంది ప్రజలకు ఎన్నో విధాలుగా తన సేవలను అందించారు.ఏ హీరో ఏ రాజకీయ నాయకుడు చేయని రీతిలో ఈయన ప్రజా సేవ చేశాడు.దీంతో ఈయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోని వారి పాలిట దేవుడు అయ్యాడు.చెప్పాలంటే కరోనా కష్టకాలంలో సోనూ ప్రజల కోసం ఓ మినీ గవర్నమెంట్ నే క్రియేట్ చేసాడని చెప్పాలి.



ఇక అలాగే నందమూరి నట సింహం బాలకృష్ణ  క్యాన్సర్ హాస్పిటల్ లో క్యాన్సర్ రోగులకు అనేక సేవలు అందిస్తున్నారు. అలాగే బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని కూడా సేకరించి అందిస్తున్నారు..ఇక టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు ఒక నిజమైన శ్రీమంతుడనే చెప్పాలి. ఈయన అందిస్తున్న సేవలు కొన్ని వందలాది చిన్నారుల ప్రాణాలను సజీవంగా నిలబెడుతున్నాయి. పేద పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయిస్తూ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి లాగే సేవా భావంతో మంచి మనసు చాటుకుంటున్నాడు. కృష్ణ గారు కూడా అప్పుడు ఇలానే కష్టాల్లో వున్న వారికి సేవలు చేసేవారు.కాని ఆయన సేవలను ఎవరూ వెలుగులోకి తీసుకురాలేదు.ఇక ఆయన లాగే సూపర్ స్టార్ మహేష్ కూడా పేద వారికి ఏదో ఒకటి చెయ్యాలని ఇలాంటి సేవలు చేస్తున్నారు. మహేష్ ఇప్పటి వరకు వెయ్యికి పైగానే పేద పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించి వాళ్ళ కుటుంబాలకు దేవుడయ్యారు.అలాగే రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకొని ఆ గ్రామాలను బాగా అభివృద్ధి చేస్తూ పేరుకి తగ్గట్టే రియల్ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నారు.ఇక కమెడియన్ అలీ కూడా సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటారు..అలీ తన సంపాదనలో కొద్దీ మొత్తం పేద ప్రజలకు విరాళంగా ఇస్తూ వారిని అనేక కష్టాల నుండి బయట పడేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: