ప్రభాస్, మారుతీ సినిమా స్క్రిప్ట్ అదేనా..?
అది ఏమిటంటే మారుతి దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా గురించి. వీరిద్దరి కాంబినేషన్లో రాజా డీలక్స్ అనే సినిమాను రూపొందించబోతున్నట్లు ఇప్పటికే బాగా వార్తలు వస్తున్నాయి. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నాడు అని కూడా ప్రచారం మొదలైందట.. స్క్రిప్ట్ వ్యవహారం కూడా ఒక దశకు వచ్చింది అంటూ క్లారిటీ కూడా ఇచ్చేశారు. అధికారిక ప్రకటన రావడమే లేట్ అని తెలుస్తుంది.
ఈ సమయంలో సినిమా టైటిల్ విషయం లో మారుతి ఆలోచనలో పడ్డాడని వార్తలు వస్తున్నాయి. రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా లేదు అంటూ కొందరు అభిమానులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన తన ఆలోచిస్తున్నట్లు వార్త అందుతోంది. ప్రస్తుతం ప్రభాస్ సన్నిహితులతో పాటు తన టీంతో కలిసి స్క్రిప్టు వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్న దర్శకుడు మారుతి, సినిమా కోసం భారీ సెట్టింగ్స్ ను హైదరాబాద్ శివారు ప్రాంతంలో నిర్మించేందుకు సిద్ధం అవుతున్నాడట.. సినిమాకు సంబంధించిన షూటింగ్ కేవలం రెండు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశాడట మారుతీ. తక్కువ డేట్స్ మారుతి కోరడం వల్లనే ఈ సినిమా ప్రభాస్ ఓకే చెప్పాడనే టాక్ కూడా వస్తుంది. అన్ని అనుకున్నట్లు అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఈ తీసిన సినిమా ను ప్రేక్షకుల ముందుకు ఇదే ఏడాది తీసుకు వస్తాం అన్నట్లుగా దానయ్య ఆ మధ్య చెప్పుకొచ్చారట.. ప్రభాస్ ఈ సినిమాలే కాకుండా సలార్ మరియు ఆదిపురుష్ ఇంకా ప్రాజెక్ట్ కే సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.