విజయ్ కోసం శివ నిర్వాణ అన్ని స్పెషల్స్!!

P.Nishanth Kumar
ప్రేమకథ సినిమాలను రూపొందించే దర్శకుడిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన సినిమాలను చేయడం ప్రారంభించిన దగ్గరినుంచి ప్రేమ కథా సినిమాలనే చేసి మంచి అనుభూతి ప్రేక్షకులందరికీ కలిగించాడు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు చేయబోయే తదుపరి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆయన దర్శకత్వం వహించిన టక్ జగదీష్ సినిమా ప్రేక్షకులను అలరించడం పూర్తిగా విఫలం అయింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు చేయబోయే సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. దానికి తగ్గట్లుగానే ఈ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో ఆయన తన తదుపరి సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ లో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరో. ఈ నేపథ్యంలో ఈ హీరోతో ఆయన ఓ మంచి ప్రేమకథా చిత్రాన్ని చేసి ప్రేక్షకులను భారీగా అలరించాలని భావిస్తున్నాడు. 

అయితే కొన్ని రోజులుగా ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ తో సినిమా చేయడం లేదని అది క్యాన్సల్ అవుతుంది అని వార్తలు వినిపించాయి. కానీ ఏ విధంగా విజయ్ దేవరకొండ నొప్పించాడు తెలియదు కానీ ఈ సినిమా క్యాన్సిల్ కాలేదని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ఇకపోతే ఈ సినిమా కోసం మరిన్ని స్పెషల్స్ తీసుకువచ్చారు శివ నిర్వాణ. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుందన్న వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇక ఈ సినిమా కోసం కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి కలయికలో రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం లైగర్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఆగస్ట్ 25 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: