వారిని టార్గెట్ చేసిన బట్టబొమ్మ!!
ఇక సినిమా తగ్గట్లుగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పూజా హెగ్డే మరియు ప్రభాస్ ఇద్దరు భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు. అక్కడ మీడియాతో చిత్రబృందం చెప్పిన సినిమా విశేషాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలా పూజా హెగ్డే తెలుగులో భారీ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టకోనుంది. ప్రస్తుతం తమిళ హీరో తో బీస్ట్ అనే సినిమాలో చేసిన పూజ హెగ్డే హిందీలో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తుంది. ఆ విధంగా మూడు భాషలలోనూ ముగ్గురు అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ ఈ ముద్దుగుమ్మ ఆయా ఇండస్ట్రీ మార్కెట్ పై కన్నేసింది.
అంతేకాదు ఇంత మంది స్టార్ హీరోలతో తాను నటించడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను అని చెబుతూ తన మనసులోని కోరికలను కూడా చెప్తుంది. తనకు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సినిమా చేయాలనే కోరిక ఉంది అలాగే కమల్ హాసన్ ధనుష్ విజయ్ దేవరకొండ వంటి హీరోలతో కూడా సినిమాలు చేయాలని ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది. అలా ఈమె అందరూ హీరోయిన్లను కవర్ చేసుకుంటూ వరస సినిమాలను చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తమిళనాట బీస్ట్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం తోనే ఆమె అక్కడ అగ్ర హీరోయిన్ గా మారిపోయింది. మరి ఈ చిత్రం విడుదల తర్వాత ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.