కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన సినిమా ఈటి, ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించగా సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు, ఇలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల కాబోతోంది. ఇలా ఈటి సినిమా విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచింది, ఈ నేపథ్యంలో ఈటి సినిమా ప్రమోషన్స్ లో సూర్య బిజీగా ఉన్నాడు.
తాజా ఇంటర్వ్యూ లో కోలీవుడ్ స్టార్ సూర్య విజయ్ మాట్లాడుతూ... లవ్ , యాక్షన్ , ఎమోషన్ తో కూడిన ఈ మూవీ లో బలమైన సామాజిక సందేశం ఉంటుంది, కథాకథనాలను దర్శకుడు పాండిరాజ్ మలిచిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని సూర్య ఈ నేపథ్యంలో తెలియజేశాడు, అలాగే మొదటి సారి తెలుగులో డబ్బింగ్ చెప్పుకునేందుకు ఆనందంగా ఉన్నట్లు సూర్య తెలియజేశాడు. తెలుగు లో విలన్ పాత్రలను రాజమౌళి గారు ఎంతో శక్తివంతంగా డిజైన్ చేస్తూ ఉంటారు, అదే తరహా లో ఈ మూవీ లో విలన్ పాత్రను దర్శకుడు పాండిరాజ్ డిజైన్ చేసినట్లు సూర్య తెలియజేశాడు, ఇది ఇలా ఉంటే ఈటి సినిమాలో విలన్ పాత్రలో వినయ్ రాయ్ కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే సూర్య ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని తెలియజేశాడు, అలాగే తన తదుపరి సినిమాలు వెట్రిమారన్, బాల తో ఉన్నట్లు సూర్య తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాల విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న సూర్య ఈటి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.