ప్రభాస్ అనుభవాలు వెనుక జాతకం !

Seetha Sailaja
 ఈ వారం  విడుదలకాబోతున్న ‘రాథే శ్యామ్’ మ్యానియా తారాస్థాయికి చేరుకుంది. ‘సాహో’ నిరాశ పరచడంతో ఎట్టి పరిస్థితులలోను బ్లాక్ బష్టర్ హిట్ కొట్టితీరాలని ప్రభాస్ ఈ సినిమాను దేశవ్యాప్తంగా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ జాతకాల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

తాను వ్యక్తిగతంగా జాతకాలను నమ్మనని ఇప్పటివరకు తన చేతిని ఏజ్యోతిష్కుడుకి చూపెట్టలేదని కామెంట్స్ చేసాడు. అంతేకాదు ప్రపంచంలోని ఏవ్యక్తి తన విధిని తప్పించుకోలేడని ఆవిధిని తప్పించుకోవాలని ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తారు కాని చివరికి విధి రాతలో అందరు పావులే అంటూ కామెంట్స్ చేసాడు.

అంతేకాదు తన ప్రేమ విషయంలో తన అంచనాలు తప్పాయని అందుకనే కాబోలు తనకు ఇప్పటివరకు పెళ్ళి కాలేదు అంటూ నైరాశ్యాన్ని వ్యక్తపరిచాడు. తనను బాలీవుడ్ ప్రేక్షకులు యాక్షన్ లుక్ లో చూడటానికి ఇష్టపడుతున్నారన్న విషయం తనకు తెలుసని అయితే వారి అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నాలలో భాగంగా తాను ‘రాథే శ్యామ్’ తీసిన విషయాన్ని వివరించాడు.

తన మూవీలో విలన్స్ ఎవరు ఉండరని ప్రకృతి ఒక మనిషి జీవితంలో ఎలా విలన్ లా మారినప్పుడు ఆ ప్రకృతితో చేసే పోరాటంతో మనిషి ఎలా విజయాన్ని సాధిస్తాడు అన్న కథ ‘రాథే శ్యామ్’ అంటున్నాడు. ఇక తన భవిష్యత్ సినిమాల గురించి చెపుతూ తాను మళ్ళీ రాజమౌళితో సినిమా చేయడం ఖాయం అంటూ అయితే అది ఎప్పుడు ఉంటుందో ప్రస్తుతానికి తనకు తెలియదు అంటున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక హస్త సాముద్రిక జ్యోతిష్కుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని అల్లబడ్డ ఒక ప్రేమ కథ ‘రాథే శ్యామ్’ అంటూ ఈ మూవీతో తన ఇమేజ్ పూర్తిగా మారిపోవడం ఖాయం అంటున్నాడు. ప్రభాస్ కు ప్రస్తుతం ఉన్న మార్కెట్ రీత్యా ఈమూవీ ఘనవిజయం సాధించడం అతడి కెరియర్ కు అత్యంత కీలకం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: