అఖిల్ కి వారి పై నమ్మకం లేదా!!

P.Nishanth Kumar
వరుసగా మూడు సినిమాలతో పోరాడి ఫ్లాప్ అయిన తర్వాత అఖిల్ నాలుగో సినిమా తో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఈ విధమైన పరాభవాలు ఏ హీరోకి కూడా జరగలేదనే చెప్పాలి. చాలామంది హీరోలు తమ వారసుల విషయం లో ముఖ్యంగా వారి సినిమాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. వారు హిట్ కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. నాగార్జున కూడా అఖిల్ సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకొని చేశాడు. అయితే ఎందుకో ఆ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.

ఒకానొక దశలో అఖిల్ సినిమాలకు పనికిరాడా అనే విధంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో చర్చలు జరిగాయి. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఈ విధమైన చర్చలు ఆగిపోవడానికి కారణం అయ్యింది. అలా తొలి విజయాన్ని అందుకున్న అఖిల్ నటనలోనూ మంచి హీరోగా నిలదొక్కుకోగలిగాడు. ఇక తాజాగా అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న మమ్ముట్టి లుక్ విడుదల చేయగా ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆ విధంగా ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ విదుడల చేయడానికి యూనిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ చేయబోయే సినిమాపై ఇప్పుడు పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.  టాలీవుడ్ దర్శకుడు అఖిల్ సినిమా చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా అఖిల్ వారందరి కంటే విభిన్నంగా ఆలోచించి బాలీవుడ్ దర్శకులతో ఆయనతో సినిమా చేసే విధంగా ముందుకు వెళుతుందని తెలుస్తుంది. తెలుగు చిత్రాలను బాగా ఆదరిస్తున్న నిర్మాత కరణ్ జోహార్ అఖిల్ బాడీ లాంగ్వేజ్ కి ఆయన ఇమేజ్ కు తగ్గ ఓ కథను తయారు చేయించారట. ఆయన నిర్మాణంలోనే బాలీవుడ్ స్టార్ డైరక్టర్ తో ఈ చిత్రాన్ని చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏజెంట్ సినిమాతో మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నడు. ఇప్పుడు  ఓ బాలీవుడ్ దర్శకుడు తో సినిమా చేయడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: