'కళావతి'.. తమిళ్, హిందీ వెర్షన్ సాంగ్స్ విన్నారా.. వేరే లెవెల్ అంతే..?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే ఇక మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా 'సర్కారు వారి పాట'.ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాకి పరశురాం దర్శకత్వం వహించడం జరిగింది అలాగే ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన కళావతి సాంగ్ నెట్టింట్లో ఇంకా ఎంతో  వైరల్ గా మారింది.అయితే ఈ పాట తక్కువ టైం లోనే 60 మిలియన్లకుపైగా వీక్షణలు అందుకున్న పాటగా రికార్డు క్రియేట్ చేసింది. కాగా అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను సిధ్‌ శ్రీరామ్‌ అలపించారు.


అయితే  భాష అర్థమవకపోయినా ఈ సాంగ్ అందరి మన్ననలను అందుకుంటుంది.ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సాంగ్ తెలుగు వెర్షన్ కాక.. తమిళ , హిందీ వెర్షన్ లు కూడా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు తెలుగు కళావతి ట్యూన్ నచ్చిన కొందరు..ఇక ఆ సాంగ్ కు వారి వారి మాతృభాషల్లో సాహిత్యం సమకూర్చి..తమదైన శైలిలో ఆలపించారు. అయితే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇకపోతే  ఒక్కసారిగా ఒరిజినల్‌ పాటకు దీటుగా ఇవీ అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది.


యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...!!




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: