ప్రస్తుతం ఇండియా వైడ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే, ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్ లు బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండేవారు, కానీ బాహుబలి సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటి నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా టాలీవుడ్ సినిమాలలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు, ఈ సినిమాలో ఒలివియా మోరీస్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది, ఇలా ఇప్పటికే ఒక టాలీవుడ్ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఈ సినిమా విడుదల కాకముందే మరి కొన్ని టాలీవుడ్ క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు చిత్ర బృందం ఆలియా భట్ సంప్రదించినట్లు ఒక సందర్భం లో ఆలియా భట్ చెప్పుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే, ఇది ఇలా ఉంటే తాజాగా ఆలియా భట్ మరో టాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ ను తీసుకునే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి, ఇలా బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఆలియా భట్ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.