అందాల ముద్దుగుమ్మ ఎస్తర్ గురించి తెలుగు
సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, హాట్
బ్యూటీ ఎస్తర్,
సునీల్ హీరోగా తెరకెక్కిన భీమవరం బుల్లోడు సినిమాతో
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది, కాకపోతే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా
సక్సెస్ కాకపోవడంతో ఎస్తర్ కు
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అవకాశాలు చాలా వరకు తగ్గాయి. ఇది ఇలా ఉంటే ఎస్తర్ ప్రస్తుతం 69 సంస్కార్ కాలనీ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించింది, ఇప్పటికే 69 సంస్కార్ కాలనీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది, ఈ ట్రైలర్ లో ఎస్తర్ తన అందచందాలతో ప్రేక్షకులను
ఫిదా చేస్తోంది.
ఇది ఇలా ఉంటే పి. సునీల్‌కుమార్
రెడ్డి దర్శకత్వంలో ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన
సినిమా 69 సంస్కార్ కాలనీ, బి. బాపిరాజు, ముతికి
నాగ సత్యనారాయణ నిర్మించిన ఈ
మూవీ మార్చి 18 వ తేదీన విడుదల కాబోతుంది, ఈ సందర్భంగా ఎస్తర్ తాజాగా విలేకరులతో మాట్లాడింది. అందులో భాగంగా ఎస్తర్.. సింగర్ గా నా కెరీర్ ప్రారంభం అయింది, 69 సంస్కార్ కాలనీ
మూవీ లో 'రా రా' అనే సాంగ్ పడాను. ఇక 69 సంస్కార్ కాలనీ సమాజానికి మంచి సందేశం ఇచ్చే
మూవీ అని ఎస్తర్ చెప్పుకొచ్చింది, తెలుగులో నేను నటించిన ఐరావతం రిలీజ్ కి రెడీ అయింది. జీ ఫైవ్ కి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్లు తెలియజేసింది, రుద్ర
సినిమా షూటింగ్ లో ఉంది, మూడు భాషల్లో రూపొందుతున్న ఓ
సినిమా చేస్తున్నాను అని తాజా విలేకరుల సమావేశంలో ఎస్తర్ చెప్పుకొచ్చింది, ఇలా ప్రస్తుతం ఎస్తర్ వరుస
సినిమా లతో ఫుల్ బిజీ గా ఉంది.