కేరళలో ప్రభాస్ "రాధేశ్యామ్" ప్రమోషన్స్...

VAMSI
ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. బాహుబలి సీరీస్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎవరెస్ట్ శిఖరం అంత పెరిగిపోయింది. దీనితో అన్ని సినిమా పరిశ్రమల నుండి డైరెక్టర్స్ తనతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. కాగా ప్రస్తుతం "రాధే శ్యామ్" మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకుని రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే "రాధే శ్యామ్" చిత్ర బృందం ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంది. ఈ సినిమాను రాధాకృష్ణ అనే యువ దర్శకుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీనిని డైరెక్టర్ ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా మలిచారు.

ఇటువంటి ప్రేమకథ ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో రాలేదని ప్రమోషన్ కార్యక్రమాల్లో చెబుతుండటం ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తోంది. కాగా ఈ సినిమా గురించిన మరొక అప్డేట్ అందుతోంది. ఈ సినిమా రిలీజ్ దగ్గర ఉండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతోంది రాధే శ్యామ్ టీమ్. అందులో భాగంగా ఈ రోజు ప్రభాస్ అండ్ టీమ్ కేరళ కు వెళ్లనుంది. అయితే ఈ ప్రమోషన్స్ ఏ విధంగా జరుగుతాయి అన్నది ఇంకా తెలియలేదు. దీని గురించి పూర్తి విషయాలు తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించింది. కొన్ని సినిమాల నుండి ప్రభాస్ కు బాగా కలిసి వస్తున్న ఆర్టిస్ట్ సత్యరాజ్, ఈయన ఇందులో ఒక కీలక పాత్ర చేశారు.  

వీరిద్దరి జోడీ స్క్రీన్ పై చూడముచ్చటగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ పాజిటివ్ గా ఇచ్చారు. దీనితో మూడు రోజుల నుండి ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం వరకు విడుదల అయినా పాటలు టీజర్ లు సో సో గా ఉన్నా ప్రభాస్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. మరి చూద్దాం ఫస్ట్ రివ్యూ ప్రకారం సాహో లాంటి ఫెయిల్యూర్ తర్వాత ప్రభాస్ హిట్ కొడతాడా లేదా?
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: