"చిరు - బాబీ" ల ప్రాజెక్ట్... హీరోయిన్ ఫిక్స్ ?

VAMSI
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే యువ హీరోలకు ధీటుగా సినిమాలను చేస్తున్నాడని చెప్పాలి. ఇప్పటికే ప్రతిష్టాత్మక దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఆచార్య టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ మరియు ప్రి రిలీజ్ పనుల్లో బిజీగా ఉంది. కాగా మళయాళ మూవీ లుసిఫర్ రీమేక్ గా వస్తున్న "గాడ్ ఫాదర్" మూవీని తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేయికోనుంది. ఇక మెహర్ రమేష్ డైరెక్టర్ గా భోళా శంకర్ కూడా సెట్స్ మీద ఉంది.

రీసెంట్ గా టాలీవుడ్ డైరెక్టర్ బాబీతో మరొక సినిమాను ప్రకటించి మెగా ఫ్యాన్స్ కు వరుస సర్ప్రైజ్ లు ఇస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు ఇంకా పేరును ఖరారు చేయకపోయినా కాస్టింగ్ మరియు మిగిలిన పనులతో  బాబీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుండి ఒక అప్డేట్ మెగా అభిమానులను థ్రిల్ చేయనుంది. తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి వచ్చిన అందాల తర శ్రుతి హాసన్ కెరీర్ మొదట్లో మంచి అవకాశాలు అందుకుని స్టార్ డం ను సంపాదించుకుంది. కానీ అప్పుడప్పుడే వస్తున్న యంగ్ హీరోయిన్ ల దాటికి తట్టుకోలేక కొంత కాలం విశ్రాంతి తీసుకుంది.

అయితే రవితేజ క్రాక్ మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అప్పటి నుండి తన దూకుడు మామూలుగా లేదు. వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ కుర్ర హీరోయిన్ లను సైతం టేక్ ఓవర్ చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా చిరు బాబీ ల ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఉందా లేదా అన్నది తెలియాలంటే  అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: