బిగ్ బాస్ ఓటిటి.. వామ్మో ఈ డబుల్ మీనింగ్ డైలాగులు ఏంటి గురూ.

praveen
బిగ్ బాస్ ఓటిటి.. అంతకుముందులా బుల్లితెర ప్రేక్షకులు అందరూ చూడకపోయినా కొంత మంది నెటిజన్లు మాత్రమే షో చూస్తున్నారు అని చెప్పాలి. ఎన్నడూ లేని విధంగా ఈసారి సరికొత్తగా బిగ్బాస్ ప్రారంభం కావడంతో  కార్యక్రమాన్ని చూసేందుకు కొంత మంది ప్రేక్షకులు కాస్త ఎక్కువగానే ఆసక్తి చూపుతున్నారు. అయితే 24 గంటల పాటు లైవ్ ప్రసారం అవుతూ ఉండడంతో  ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారు అన్నది ప్రతి క్షణంప్రత్యక్షంగా వీక్షిస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. అంతా బాగానే ఉంది కానీ ఇటీవలి కాలంలో బిగ్బాస్  లో కంటెస్టెంట్స్ మాట్లాడుతున్న డబల్ మీనింగ్ డైలాగులు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేస్తూ ఉన్నాయి.


 ఇక ఇటీవలే మార్నింగ్ యాక్టివిటీ లో భాగంగా  ఒక్కో సభ్యుడు ఒకరిని ఎంచుకుని ప్రశ్నలు అడగాలి. ఇక ఆ ప్రశ్నలకు తప్పుడు ఆన్సర్ ఇవ్వాలి.. ఎండ్ బజార్ మోగేసరికి ఎవరికి ఎన్ని మార్కులు పడతాయో వాళ్ళ గెలిచినట్లు అంటూ బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు. మొదట బిందుమాధవి సరయు నీ కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇక ఒక్కసారి కూడా సరైన సమాధానం  ఇవ్వకుండా ఫన్ జనరేట్ చేసింది సరయు. ఆశు రెడ్డి యాంకర్ శివాని బోల్తా కొట్టించింది. నా కళ్ళ లోకి ఎందుకు చూడటం లేదు అని అడుగగా నేను చూడను అంటూ ఆన్సర్ ఇచ్చి దొరికి పోయాడు.ఇక నటరాజ్ మాస్టారు బోల్తా కొట్టించాడు అర్జె చైతూ.  ఇలా అరియనా, అషు, శివ ఇలా పలువురు టాస్క్ ఫన్ జనరేట్ చేసి ప్రేక్షకులను నవ్వించారు.



 ఈ క్రమంలోనే యాంకర్ శ్రవంతి  తన లవ్ స్టోరీ గురించి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా కథలు కథలుగా చెబుతుంది. ఇక ఇదే సమయంలో స్రవంతి అషు రెడ్డి అరియనా.. ఈ ముగ్గురు భామల నడుమ అజయ్ ఉన్నాడు. అషురెడ్డి తన దర్శకత్వ ప్రతిభ చూపించి సరదా తీర్చుకుంది. అరియనా నీ ముద్దుల మరదలు నేను నీ పెళ్ళాన్ని నువ్వు ప్రస్టేటెడ్ మొగుడివి ఎంటర్టైన్మెంట్ చెయ్యు  అంటూ అజయ్ ని కోరింది. ఇక ఇలా అడిగిందో లేదో ముగ్గురు క్యారెక్టర్స్ లోకి దూరిపోయి సందడి  చేశాడు అజయ్. అదే సమయంలో కొంతమంది కంటెస్టెంట్స్ డబల్ మీనింగ్ డైలాగులతో ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. ముఖ్యంగా అరియనా, ఆశు రెడ్డి,  యాంకర్ శివ లాంటి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: