అరుదైన ఘనత సాధించిన ప్రముఖ హీరోయిన్ మీనా..!!
ఇక తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతున్న మీనా తాజాగా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈమెకు యూఎస్ఏ కి సంబంధించి గోల్డెన్ వీసా వచ్చినట్లుగా సమాచారం. దీంతో ఉపయోగాలు ఏమిటంటే ఆ దేశపు గోల్డెన్ వీసా అందుకున్నవారు ఆ దేశంలో దాదాపుగా పది సంవత్సరాల పాటు అక్కడే వారసత్వాన్ని కలిగి ఉంటారు. ఇకపోతే ఇప్పటికీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోనే కాదు ఇతర సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది సెలబ్రిటీలు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇకపోతే గోల్డెన్ వీసా ను అందుకున్న వారి విషయానికొస్తే బాలీవుడ్ బాద్ షా గా గుర్తింపు తెచ్చుకున్న షారుక్ ఖాన్.. సంజయ్ దత్ కూడా గోల్డెన్ వీసాను సొంతం చేసుకున్నారు..
వీరితోపాటు మమ్ముట్టి , పార్థివన్ , మోహన్ లాల్, త్రిష, అమలాపాల్ , కాజల్ అగర్వాల్ తో ప్రణీత కూడా ఈ గోల్డెన్ వీసా ను సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల ఉపాసన కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. ఇక మీనా కూడా గోల్డెన్ వీసాను అందుకోవడం గమనార్హం. ఇకపోతే మీనా తాజాగా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.